Breaking News

విద్యుత్ రంగంలో పురోగతిని చాటిచెప్పేందుకు బిజిలీ మహోత్సవ నిర్వహణ…

-కార్యక్రమాలను నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ లోని 52 స్థానాల ఎంపిక

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలను పురస్కరించుకుని నిర్వహించే వేడుక ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా – కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి జూలై 2022 చివరి వారంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘బిజిలీ మహోత్సవ్’ను నిర్వహిస్తోంది. ‘ఉజ్వల్ భారత్, ఉజ్వల్ బహ్విష్య – పవర్@2047″గా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు, జులై 25, 2022 నుంచి దేశవ్యాప్తంగా వారం రోజుల కార్యక్రమం ప్రారంభమవుతుంది. దీని ప్రకారం, బిజిలీ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం 26 జిల్లాలలో (ప్రతి జిల్లాలో రెండు ప్రదేశాలలో) నిర్వహించ తలపెట్టారు. జులై 30, 2022న ‘బిజిలీ మహోత్సవ్’ ముగింపు ఉత్సవం సందర్భంగా, గౌరవనీయులైన ప్రధాన మంత్రి ఆంధ్రప్రదేశ్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో సంభాషించనున్నారు. దేశంలో ఇంధన భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివిధ సంస్కరణలు, నిర్వహించే కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణలను ప్రదర్శించడానికి బిజిలీ మహోత్సవ్ ఒక వేదిక కానుంది. సాధారణ ప్రజలను, అభిప్రాయ రూపకర్తలను , విధాన రూపకర్తలకు ఆడియో-విజువల్ మీడియా, తోలుబొమ్మలాట, వీధి నాటకాల ద్వారా అవగాహన కల్పించాలని; సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ఫోగ్రాఫిక్స్ ప్రదర్శన , ఇతివృత్తాలపై లఘు చిత్రాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని; యూనివర్సల్ యాక్సెస్ , గృహ విద్యుదీకరణ, వన్ నేషన్ వన్ గ్రిడ్, వినియోగదారుల హక్కు, పునరుత్పాదక శక్తి, సామర్థ్య జోడింపు మొదలైన విషయాలపై అవగాహన పెంచాలని ఈ ఉత్సవ ప్రయత్నం. ఇంకా ఈ ఉత్సవాల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి, ‘విజన్ పవర్ @ 2047’ కి అనుగుణంగా కార్యక్రమంలో పాల్గొనేవారి అభిప్రాయాలను అభ్యర్థించాలన్న లక్ష్యం ప్రధానంగా ఉంది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *