విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జ్యోతి ప్రజ్వలన చేసిన సెంట్రల్ నియోజక ఎమ్మెల్యే మల్లాది విష్ణు వర్ధన్ రావు, ఆంధ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పి.వి.రామారావు చేతుల మీదుగా ప్రారంభం చేశారు. మోకాలు మార్పిడికి మొట్టమొదటి పూర్తి ఆటోమేటిక్ రోబోటిక్స్ శస్త్రచికిత్స యూనియన్ హాస్పిటల్ నందు ప్రారంభించినట్లు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కడియాల జయకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆటోమేటిక్ రోబోటిక్ శస్త్రచికిత్స వివరాలు తెలిపేందుకు నగరంలోని హోటల్ నోఓటల్ నందు ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా డాక్టర్ కడియాల జయకృష్ణ మాట్లాడుతూ విజయవాడలోని యూనియన్ హాస్పిటల్స్ మోకాలి మార్పిడి కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా పూర్తి ఆటోమేటిక్ రోబోటిక్ చికిత్స అందుబాటులోకి తీసుకువచ్చింది అని తెలిపారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో నేటికి ఉన్న ఏకైక పూర్తి ఆటోమేటిక్ రోబోటిక్స్ ఇది అని తెలిపారు. “సియువిఐఎస్ జాయింట్ ” (రోబోటిక్ మెషీన్), మోకాలి మార్పిడికి ప్రపంచంలోని మొట్టమొదటి పూర్తి ఆటోమేటిక్ యాక్టివ్ రోబోటిక్ సిస్టం, మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలను మరింత ఖచ్చితమైనదిగా, దోషరహితంగా మరియు దుష్ప్రభావాలు లేకుండా చేస్తుందని తెలిపారు. కొత్త రోబోటిక్ మోకాలు మార్పిడి ఎక్విప్మెంట్ రోగులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుందని అన్నారు. ఇది రోగులకు సురక్షితమైన శస్త్రచికిత్స తో పాటు, ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా దోషరహితంగా అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని అన్నారు. ఆపరేషన్ తర్వాత నొప్పి చాలా తక్కువగా ఉంటుందని విరిగిన జాయింట్ ప్రాంతాన్ని మాత్రమే కట్ చేయటానికి సర్జరీని అనుమతిస్తుందని తెలిపారు. ఆరోగ్యకరమైన చుట్టుపక్కల ఎముక మరియు కణజాలాన్ని సంరక్షిస్తుంది అని తెలిపారు. చిన్న కోతలను ఉపయోగించి రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ చేయటం వలన శస్త్రచికిత్స అనంతరం నొప్పి తగ్గి వేగంగా కోలుకుంటారు. చాలా మంది రోగులు ఒకటి లేదా రెండు రోజుల్లో అసుపత్రి నుండి డిశ్చార్ట్ కావచ్చు. ఇది భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా గుర్తింపు పొందినది అని అన్నారు. అత్యాధునిక సాంకేతికతల ద్వారా అధునాతన వైద్య సంరక్షణ అందించాలని మేము యూనియన్ హాస్పిటల్ ద్వారా ఈ పూర్తి ఆటోమే ట్రిక్ రోబోటిక్స్ ని అందుబాటులోకి తేవటం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News