-జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో స్వీకరించిన ఆర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపడం ద్వారా ప్రజల మన్ననలను పొందాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో భాగంగా నగరంలోని కలెక్టర్ స్పందన సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ డిల్లీరావు జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్ కుమార్, డిఆర్‌వో కె.మోహన్ కుమార్, డ్వామా పిడి జె. సునీతలు ప్రజల నుండి స్పందన ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్పందనలో ఆర్జీలు సమర్పించే ఆర్జీదారుల సమస్యలను అధికారులు ఒపిగ్గా వినాలన్నారు. పరిష్కరించలేని పక్షంలో సరైన వివరణ ఇవ్వాలన్నారు. అప్పుడే సామాన్యులకు అధికారులపై గౌరవం వ్యవస్థ మీద నమ్మకం పెరుగుతుందన్నారు. ప్రజల నుండి అందే ఆర్జీల పరిష్కారంపై సరైన అవగాహన కల్గి నాణ్యతతో పరిష్కరించాలన్నారు. స్పందన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుంటుందని అన్నారు. ఒకసారి పరిష్కరించిన ఆర్జీలు తిరిగి మరల రాకూడదన్నారు. ప్రజా సమస్యలను సాధ్యమైనందవరకు సచివాలయ వార్డు పరిధిలోనే పరిష్కరించాలన్నారు. ఆర్జీదారునితో సమస్యలు తెలుసుకుని అతనికి అర్థం అయ్యే రీతిలో వివరాలను తెలిపి పరిష్కరిస్తే మళ్లీ అదే సమస్యపై అర్జీరాదని కలెక్టర్ అన్నారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా నుండి క్షేత్రస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ అర్జీల పరిష్కారంపై సరైన అవగాహన పెంపొందించుకోవాలన్నారు. అర్జీదారులు సంతృప్తి చెందే విధంగా వాస్తవ విషయాలపై సమాధానం చెప్పాలన్నారు. అర్జీలు రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తప్పనిసరిగా సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలించుకోవాలన్నారు. తప్పడు ఎండార్స్మెంట్ లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. అర్జీలు స్పందన కార్యక్రమంలోనే కాకుండా గ్రామ వార్డు సచివాలయం 1902 కాల్ సెంటర్ మొబైల్ యాప్, వెబ్ అప్లికేషన్ తదితర గ్రీవెన్స్ ద్వారా నమోదవుతాయన్నారు.వీటిని ఎప్పటికప్పుడు అధికారులు పరిశీలించి గడువులోగా పరిష్కారం చూపాలని కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. స్పందన కార్యక్రమంలో 75 అర్జీల నమోదు అయ్యాయని వీటిలో అత్యధికంగా రెవెన్యూ 31, పోలీస్ 10, యంఏయుడి 9, విద్య 7, సోషల్ వెల్ఫెర్ మూడు కాగా సర్వే అండ్ సెటిలిమెంట్, మత్స్య, వైద్య, హౌసింగ్ తదితర శాఖలకు రెండేసి ఆర్జీలు మిగిలిన వివిధ శాఖలకు చెందినవి ఏడుగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు.
ప్రధానంగా నమోదైన ఆర్జీలు ఈ విధంగా ఉన్నాయి..
గంపలగూడెం మండలం వినగడప గ్రామనికి చెందిన ఆర్ పుష్పావతి ఆర్జీ ఇస్తూ వినగడప గ్రామ రెవెన్యూ పరిధిలో కట్టలేరు ఎటి పరివాహపు ప్రాంతానికి ఆనుకుని ఉన్న భూములలో అనుపతులు లేకుండా ఇటుక బట్టిలకు అక్రమ మట్టి తవ్వాకాలు జరుగుతున్నాయని దీనివలన ఈ ప్రాంతాలు వరద ముంపుకు గురి అయ్యా పరిస్థితులు ఉన్నాయని దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
జి. కొండూరు మండలం వెలగలేరు గ్రామానికి చెందిన పోలుదాసు బాలయ్య తన పొలం సరిహద్దులో చేపల చెరువు తవ్వారని, ఇటిక బట్టిని నిర్వహిస్తున్నారని అందువలన రహదారి కూడా ఆద్వానంగా తయారు అయిందని ఇటుక బట్టిలు చేెపల చెరువును తొలగించేలా చర్యలు తీసుకోవాలని ఆర్జీ అందజేశారు.
ప్రభుత్వ జనల్ ఆసుపత్రికి చెందిన సిబ్బంది ఆర్జీ అందజేస్తూ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎస్‌ఎస్ బ్లాక్‌లో టెక్నికల్ డిపార్టమెంట్ నందు 20 మంది సిబ్బంది గత రెండు సంవత్సరాలుగా పనిచేయచున్నామని ఈ ఏడాది ఏప్రిల్ 24వ తేది నాటికి తమకు ఉన్న ఆర్డర్ గడువు ముగిసిందని అయినప్పటికి జూలై 25వ తేది వరకు విధులు నిర్వహిస్తున్నామని తమకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామానికి చెందిన ఆర్ సీతారామమ్మ ఆర్జీ సమర్పింస్తూ తనకు పొక్కునూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 166/3 నందు 2 ఎకరాల వ్వవసాయ భూమి ఉందని అందులో గత ఖరీఫ్ సీజన్‌లో మిర్చి మండలను సాగు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అయితే ఈ`క్రాప్ నమోదులో మిర్చి పంటకు బదులు అధికారులు పత్తి పంటగా నమోదు చేశారని ఇందు వలన పంటల నష్టం భీమా సౌకర్యం పొందలేకపోయానని తగు విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News