Breaking News

అక్రమ రవాణా బాధితుల పునరావాసం జి.వో పునరుద్ధరించండి… రాష్ట్ర ముఖ్యమంత్రికి ‘‘విముక్తి’’ వేడ్కోలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
‘‘నవరత్నాలు’’ పేరిట అట్టడుగు, బలహీన వర్గాల ప్రజలు, మహిళలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా వారి ఆర్ధిక అభివృద్ధి సాధికారత కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి, మానవ అక్రమ రవాణా బారినుంచి బయట పడిన మహిళలు, బాలికల పునరావాసం, సంక్షేమం కోసం 2003లో రూపొందించిన జి.వో నెం:1 పునరుద్ధరించి, సక్రమంగా, పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని కోరుతూ అక్రమ రవాణా బాధిత మహిళల రాష్ట్ర సమాఖ్య ‘‘విముక్తి’’ అధ్యక్ష కార్యదర్శులు రజని, బి.పుష్పావతి రాష్ట్ర ముఖ్య మంత్రికి వినతి పత్రం అందించినట్లు తెల్పారు.

‘‘విముక్తి’’ ద్వారా 2015 నుంచి 2020 వరకు అక్రమ రవాణా బాధిత మహిళల పునరావాసం, సంక్షేమం, సాధికారత కోసం రూపొందించిన జి.వో నెం:1/2003 అమలు తీరు గురించి ‘‘సమాచార హక్కు చట్టం’’ ద్వారా ఈ జి.వో అమలు, పర్యవేక్షణ చేస్తున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా వివరాలు సేకరించడం జరిగిందని, ఆ సమాచారం బట్టి రాష్ట్రంలో ఈ జీవో అసలు అమలుకు నోచుకోవడం లేదని అర్ధం అయిందని రజని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో 2015 నుంచి 2020 వరకు జిల్లా యాంటీ ట్రాఫికింగ్‌ స్క్వాడ్‌ ద్వారా 502 మంది మహిళలను అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పిస్తే 102 మందికి ‘‘తక్షణ ఆర్ధిక సహాయం’’ క్రింద రూ.20,000/` వంతున ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే 502 మంది మహిళలను అక్రమ రవాణా, వ్యభిచారం నుంచి విముక్తి కల్పిస్తే 601 మందికి పునరావాస సేవలు అందించినట్లు పేర్కొనడం చాలా విస్మయం కల్గిస్తుంది.
ఆర్ధిక సాధికారత కోసం రాష్ట్రంలో ఒక్క ప్రకాశం జిల్లాలో మాత్రమే 26 మంది బాధితులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఆర్ధిక సహకారం అందించి జీవనోపాదులు కల్పిలంచినట్ల పేర్కొనడం జరిగింది. అలాగే ఈ 26 మందికి మాత్రమే ప్రకాశం జిల్లాలో హెల్త్‌ కార్డులు అందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో మాత్రమే 68 మంది బాధిత మహిళలకు పక్కా గృహాలు అందించినట్లు తెలిపారు.
ఈ 6 సంవత్సరాల కాలములో 47 మంది బాధిత మహిళలకు మాత్రమే మానసిక ఆరోగ్య చికిత్సలు, సేవలు అందించినట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు. అక్రమ రవాణా బాధిత మహిళల పిల్లలకు ఏ ఒక్కరికి పాఠశాలలో చేర్పించడం జరగలేదని, అలాగే వారికి ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు, పోస్టర్‌కేర్‌ సేవలు అందించలేదని ఆ నివేదికలో పేర్కొనడం జరిగింది.

పొంతన లేని లెక్కలు :
‘‘సమాచార హక్కు చట్టం’’ క్రింద రాష్ట్ర మహిళా, అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యాలయం ఇచ్చిన లెక్కలు సంఖ్య ఎక్కడా పొంతన లేదు. జాతీయ నేర గణాంకాల శాఖ (NCRP – National Crime Records Buero) లెక్కలు ప్రకారం 2016 నుంచి 2020 వరకు రాష్ట్రంలో అక్రమ రవాణా నుంచి 2150 మంది మహిళలు, బాలికలను విముక్తి చేసినట్లు పేర్కొంటుంది. అయితే రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన రిపోర్ట్‌ ప్రకారం 2015 నుంచి 2020 వరకు జిల్లా యాంటీ ట్రాఫికింగ్‌ స్క్వాడ్‌ ద్వారా 502 మంది మహిళలను మాత్రమే విముక్తి చేయగా రాష్ట్రంలోని వివిధ షెల్టర్‌ హోమ్‌లలో 1841 మంది బాధిత మహిళలు, బాలికలకు (ఉజ్వల`860, స్వదార్‌`276, 18 ఏళ్ళ లోపు బాలికలు 358 మందిని ప్రభుత్వ బాలసదన్‌లోను, 374 మంది బాధితులు స్వచ్ఛంద సంస్థలు నడుపు షెల్టర్‌ హోమ్‌లలో) వసతి కల్పించి కౌన్సిలింగ్‌ సేవలు అందినట్లు పేర్కొన్నారు.
మరో విచిత్రం ఏమిటంటే ఈ 6 ఏళ్ళలో ఉజ్వల హోమ్‌లో 860 మందికి బాధితులకు రక్షణ, షెల్టర్‌ కల్పించినట్లు చెప్తూ, మరోప్రక్క 1238 మందికి ఈ ఉజ్వల హోమ్‌లలో ఒకేషనల్‌ మరియు స్కిల్‌ శిక్షణలు ఇచ్చినట్లు పేర్కొనడం హాస్య స్పందంగా ఉంది. అందులో ఎక్కువ శాతం గుంటూరు జిల్లా ఉజ్వల హోమ్‌లలో మాత్రమే ఈ శిక్షణలు అందించారు.
రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ వారి లెక్కల ప్రకారం 2015 నుంచి 2020 వరకు రాష్ట్రంలో 502 మహిళ బాధితులను అక్రమ రవాణా నుంచి విముక్తి కల్పించితే 55 మంది బాధితులకు జీవో 28 ప్రకారం తక్షణ సహాయం క్రింద ఒక్కొక్కరికి రూ.20,000/` అందించగా మరో 102 దరఖాస్తులు ఇంకా తమ వద్ద పెండిరగ్‌లో ఉన్నట్లు పేర్కొనడం జరిగింది. మరి మిగిలిన బాధిత మహిళల నుంచి ఎందుకు దరఖాస్తులు సేకరించలేదో అర్ధం కాని విషయం. మరో విషయం ఏమిటంటే ఈ బాధితులు అందరూ షెల్టర్‌ హోమ్‌లో ఉన్నందున మరి ఆ హోమ్‌ సిబ్బంది బాధిత మహిళలు చేత ఎందుకు దరఖాస్తు చేయించలేదో అర్ధంకాని విషయం.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.50 లక్షల మంది సెక్స్‌ వర్కర్ల రిజిస్టర్‌ కాబడి ఉన్నారని, అలాగే నేర గణాంకాల శాఖ లెక్కల ప్రకారం షుమారు ప్రతి ఏటా 300 మంది మహిళలు, బాలికలు అక్రమ రవాణా చెర నుంచి విముక్తి అవుతున్నారని, వీరందరికి పునరావాసం కల్పించి తిరిగి అక్రమ రవాణా కాకుండా వీరికి ఆర్ధిక సహకారం, సంక్షేమం ఈ జి.వో నెం:1/2003 ద్వారా కల్పించాలని ‘‘విముక్తి’’ కోరుతుంది.

జి.వో నెం:1 పునరుద్ధరించాలి ` విముక్తి డిమాండ్‌:
అక్రమ రవాణా బాధితులు మరియు వ్యభిచారంలో మ్రగ్గుతున్న మహిళల పునరావాసం, సంక్షేమం, అభివృద్ధికోసం ప్రారంభించిన జి.వో.నెం:1/2003 తిరిగి పునరుద్ధారించి, సక్రమంగా అమలు జరిగేలా చూడాలని విముక్తి నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభత్వ అక్రమ రవాణా బాధితులకు కౌన్సిలింగ్‌, శిక్షణలు పేరుతో షెల్టర్‌ హోమ్స్‌లో నెలలు, ఎళ్ళ తరబడి నిర్బందించకుండా ప్రత్యేకంగా ‘‘కమ్యూనిటి ఆధారిత పునరావాసం’’ పాలసి రూపొందించి దాని ద్వారా పునరావాసం కార్యక్రమాలు గ్రామ ‘‘సచివాలయాలు’’ ద్వారా చేపట్టాలని కోరారు.
అక్రమ రవాణా, బలవంత వ్యభిచారం నుంచి విముక్తి పొందిన ప్రతి మహిళ బాధితురాలికి వారం రోజుల్లోనే ‘‘తక్షణ సహాయం’’ రూ.20,000/` అందించేలా చర్చలు తీసుకోవాలని విముక్తి సభ్యులు డిమాండ్‌ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *