-ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌టిఆర్ జిల్లా పరిధిలోని 9 ఐసిడిఎస్ ప్రాజెక్టుల పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ కార్యకర్తలు ఆయా పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా శిశు సంక్షేమ అధికారిని జి. ఉమాదేవి ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని విజయవాడ `1 విజయవాడ `2 మైలవరం కంకిపాడు పరిధిలోని రూరల్ మండలం చిల్లకల్లు కంచికచర్ల నందిగామ తిరువూరు విస్సన్నపేట ప్రాజెక్టులలో 8 అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు 73 ఆయా పోస్టులు ఒక మిని అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులను రోస్టర్‌ను అనుసరించి భర్తీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్త ఆయా మిని అంగన్‌వాడీ పోస్టులకు 21 సంవత్సరాలు నుండి 35 సంవత్సరాలలోపు వయస్సు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణురాలై ఆదే ఊరికి చెందిన కోడలై వారు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హత ఉంటుందన్నారు. పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ధరఖాస్తులను ఆగస్టు నెలలో అందజేయవలసి ఉంటుందన్నారు. వివిత వివరాలకు సమీపంలోని ప్రాజెక్టులలో చెందిన సిడిపివో కార్యాయలం నందు లేదా జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కార్యాలయంలో నందు సంప్రదించాలని జి. ఉమాదేవి తెలిపారు.
Prajavartha Online Telugu News