Breaking News

హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకోండి…

-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌ సందర్భంగా హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఆజాదీ కా అమృత్‌ మహాత్సవ్‌లో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమం నిర్వహణపై సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ ఆయన కార్యాలయంలో వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి చేపట్టావలసిన దిశా నిర్థేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు దేశ స్వాతంత్య్ర స్పూర్తితో కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పించేలా ప్రచారణ నిర్వహించాలన్నారు.జిల్లాలో స్వాతంత్య్ర సమరయోదులు దేశ నాయకుల విగ్రహాలను శుభ్రపరచి నూతన శోభను సంతరించుకునేలా అలంకరించాలన్నారు. పురవస్తుశాఖ గుర్తించిన ప్రాంతాలైన గాంధీ పర్వతం, కొండపల్లి ఖిల్లా, మొగల్రాజపురం గుహలు వంటి ప్రాముఖ్యత గల ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆగస్టు రెండవ తేదీన జాతీయ జెండా రూపకర్త పింగళివెంకయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. పాఠశాలలు కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు దేశభక్తిని చాటి చెప్పేలా సాంస్కృతిక కార్యక్రమాలు చర్చా గోష్టిలు, వ్యాసరచన, వతృక్తత్వం, పాటల పోటీలను నిర్వహించడంతోపాటు ప్రతి గ్రామంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో ర్యాలీలను నిర్వహించేలా మండల స్థాయి అధికారులకు భాధ్యతలను అప్పగించాలని అన్నారు. ఆగస్టు 13,14,15, తేదీలలో ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను అవిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నుండి సరఫరా చేసిన జాతీయ పతాకాలను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి పంపిణీ చేసి హర్‌ ఘర్‌ తిరంగ కార్యక్రమం విజయవంతం చేసేలా ప్రజలలో దేశభక్తిని నింపాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *