-డిఆర్ఓ కె. మోహన్‌కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి కె. మోహన్ కుమార్ ఆదేశించారు. కలెక్టర్ట్ డిఆర్వో చాంబర్లో బుధవారం ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో డిఆర్వో కె. మోహన్‌కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 3వ తేది నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నామని, అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ఇందులో మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 5:30 గంటల వరకు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరీక్షల కోసం జిల్లాలో 50 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు 73 వేల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. పరీక్షల నిర్వహణకై 50 మంది ఇన్విజిలేటర్స్, 50 మంది ఛీప్ సూపర్త్వెజర్లు విధులను నిర్వర్తిస్తారన్నారు.జిల్లాలో రెండు ఫ్లయింగ్ స్క్వాడ్లు, పరీక్ష కేంద్రాలలో సిసికెమెరాల ద్వారా పర్యవేక్షణ ఉంటుందన్నారు. పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నేపథ్యంలో కోవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని విద్యార్థులంతా మాస్క్‌లు ధరించేలా చూడాలని పరీక్ష హాల్లో శానిటైజేషన్ చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద మాస్క్‌లు ఏర్పాటు మోడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష హాల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని విద్యుత్ కు ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా చేయాలని సూచించారు. పరీక్ష హాల్లో అవసరమైన వెలుతురు ఉండాలని విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అన్ని రకాల చర్యలు త్ణీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఆర్టిసీ బస్సు రవాణా సౌకర్యం కల్పించాలన్నారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల సమీపంలో ఎటువంటి జిరాక్స్ సెంటర్లు లేకుండా మూసివేయించాలన్నారు. పరీక్షల కోసం బందోబస్తు ఏర్పాటు చేయాలని, అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకొని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ రీజనల్ ఇన్ప్పెక్షన్ ఆఫీసర్ పి. రవికుమార్, డిప్యూటి డిఇవో రవికుమార్, ఆర్టిసి డిపో మేనేజర్ కె.బసవయ్య వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News