Breaking News

సుమ‌ధుర క‌ళానికేత‌న్ 49వ వార్షికోత్స‌వ వేడుక‌లు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 29, 30, 31 తేదీల్లో సుమధుర కళానికేతన్ రజతోత్సవ తెలుగు హాస్యనాటికల పోటీలు మరియు 49వ వార్షికోత్స‌వం కార్య‌క్ర‌మాన్ని ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం సౌజన్యంతో మొగల్రాజ‌పురంలోని పీబీ సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు సుమ‌ధుర అధ్య‌క్షుడు సామంత‌పూడి న‌ర‌స‌రాజు, ప‌రిష‌త్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ ఎన్‌.ముర‌ళీకృష్ణ తెలిపారు. ఈ విష‌య‌మై బుధ‌వారం నగరంలోని ఓ హోట‌ల్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సామంత‌పూడి న‌ర‌స‌రాజు, డాక్ట‌ర్ ముర‌ళీకృష్ణ‌లు మాట్లాడుతూ 29న నాదస్వరం, జ్యోతి ప్రజ్వ‌ల‌న, స్వాగత నృత్యం అనంతరం సాయంత్రం 6 గంటలకు ఎల్.వి.ఆర్. క్రియేషన్స్, గుంటూరు వారిచే కావూరి సత్యనారాయణ రచన, దర్శకత్వంలో ‘లబోదిబో’ నాటికతో పోటీ ప్రదర్శనలు ప్రారంభం అవుతాయ‌న్నారు. రాత్రి 7.15 గంట‌లకు మురళీ కళానిలయం, హైదరాబాద్‌ వారిచే ‘ఓర్ని అదా విషయం ‘ నాటిక శంకరమంచి పార్ధసారధి రచనను స్వర్గీయ తల్లావఝల సుందరం దర్శకత్వంలో ప్రదర్శిస్తార‌ని తెలిపారు. 8.45 గంటలకు మద్దుకూరి ఆర్ట్స్ & క్రియేషన్స్, చిలకలూరిపేట వారిచే “మంచం మీద పెళ్ళి’ నాటికను ఎం. రవీంద్రబాబు రచన, దర్శకత్వంలో ప్రదర్శించబడును. 30న సాయంత్రం 6:15 కి అమెచ్యూర్ డ్రమెటిక్ అసోసియేషన్, చిలకలూరిపేట వారి “కాకి సందేశం’ అద్దేపల్లి భరత్ కుమార్ రచనను, ఎస్.కె.షఫీ దర్శకత్వంలో ప్రదర్శిస్తారు. 7:15 గంటలకు కర్టెన్ కాల్, హైదరాబాదు వారి ‘పెట్రోమాక్స్ పంచాయితీ’ నాటికను గోవాడ వెంకటేష్ రచన, సురభి సంతోష్ దర్శకత్వంలో ప్రదర్శిస్తారు. రాత్రి 8:45కి కళానికేతన్, వీరన్నపాలెం వారి ‘లచ్చిందేవీ లైన్ తప్పింది’ నాటిక ఎ.భాస్కర్ చన్ద్ర రచనను, ఐ.వి.ఆచారి దర్వకత్వంలో ప్రదర్శిస్తారు. 31 సాయంత్రం 6:05 గంటలకు యంగ్ థియేటర్ ఆర్గనైజేషన్, విజయవాడ వారిచే “అనుకున్నదొకటి అయిందొకటి’ నాటికను డి.ఎన్.ఆర్. రచనను, రౌతు వాసుదేవరావు దర్శకత్వంలో, 7:15 గంట‌లకు మల్లాది క్రియేషన్స్, హైదరాబాద్‌ వారి ‘లెక్క తప్పింది’ నాటిక మల్లాది రవికిరణ్ రచనను, మల్లాది భాస్కర్ దర్శకత్వంలో ప్రదర్శిస్తార‌ని చెప్పారు.

29న రావికొండలరావు, రాధాకుమారి స్మారక పురస్కారం శ్రీకాకుళంకు చెందిన ప్రముఖ రంగస్థల, పౌరాణిక నటి కె.మంగాదేవికి, 30న శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం ప్రముఖ రంగస్థల నటులు, దర్శకులు జి.రాధాకృష్ణమూర్తికి ప్రధానం జరుగుతుంది. 31న జంధ్యాల స్మాకర పురస్కారం ప్రముఖ సినీగేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావుకి ప్రధానం చేయనున్న‌ట్లు తెలిపారు. యువజనోత్సవాలు-పోటీలు యువతలో నిబిడీకృతమైన ఆశక్తిని, కళాభిజ్ఞతను వెలుగులోకి తెచ్చి ప్రోత్సహించాలనే ఆశయంతో కొన్ని ప్రత్యేక కార్యక్రమాలను, పోటీలను నిర్వహిస్తున్న‌ట్లు తెలిపారు. 31 ఉదయం 10 గంటలకు ‘పాడుతా తీయగా’ అంటూ భమిడిపాటి శ్రీలలిత, ఎన్.భవ్యశ్రీ గీతిక, పి.సాత్విక శ్రీజ, మల్లిక్, భరత్ వేమూరి, జి.ఎన్.ఎస్. ప్రణీత పాల్గొని గీతాలను ఆలపిస్తారు. లేఖ్యా భరణి, శృతి సమన్విత కూచిపూడి నృత్యాలు, ముత్యాల చౌరీ స్వరూప్ వాయిద్య విన్యాసం ప్రత్యేక ఆకర్షణ. 30 సాయంత్రం బృందగానం, పద్యపఠనం, 31 ఉదయం జానపద నృత్యాలు, మధ్యాహ్నం హాస్యప్రహసన (స్కిట్) పోటీలు జరుగుతుంది. చివరిగా జరిగే బహుమతి ప్రధానోత్సవ సభలో విజేతలకు ప్రముఖలచే నగదు, జ్ఞాపికలతో సత్కారం ఉంటుంది. ఉత్సవాల్లో విజయవాడ సెంట్ర‌ల్, ఈస్ట్ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, గద్దె రామమోహనరావుతో పాటు బి.వి.ఎస్. ప్రకాష్, పి.వి.ఎన్. కృష్ణ, చింతా వెంకటేశ్వర్లు, ఎ.పి. స్టేట్ టాక్సెస్ చీఫ్ కమిషనర్ సూదగాని రవిశంకర్ నారాయణ, పారిశ్రామిక వేత్త పుట్టగుంట వెంకట సతీష్ కుమార్, ఎస్.బి.ఐ.డి.జి.ఎం. కె.రంగరాజన్, సిద్ధార్ధ అకాడమి డాక్టర్ పి.నాగేశ్వరరావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, గంగోత్రిసాయి, చలువాది ప్రసాద్, జె.ఎస్.టి.సాయి, పి.మధు, వి.చంద్రశేఖర్ తదితరులు అతిథులుగా పాల్గొంటార‌ని తెలిపారు.

ఈ స‌మావేశంలో సుమ‌ధుర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి పి.వి.భాస్క‌ర‌శ‌ర్మ‌, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ య‌స్‌.య‌న్‌.మూర్తి, ప్రాథ‌మిక ప‌రిశీల‌కులు డాక్ట‌ర్ డి.కైలాస‌రావు, సిద్ధార్థ అకాడ‌మీ కార్య‌ద‌ర్శి బి.వి.ఎస్.ప్ర‌కాష్, త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *