Breaking News

కోఎడ్యుకేషన్ కొనసాగించడంపై అధ్యాపకుల హర్షం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే మల్లాది విష్ణుని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన SRR & CVR కళాశాల సిబ్బంది
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని SRR & CVR జూనియర్ కళాశాల అధ్యాపక బృందం గురువారం ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కళాశాలలో కోఎడ్యుకేషన్ విధానాన్ని యథావిధిగా కొనసాగింపునకు కృషి చేసినందుకుగానూ విద్యార్థుల తల్లిదండ్రుల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే విద్యాశాఖ మంత్రితో మాట్లాడి పరిష్కార దిశగా ఆయన చూపిన చొరవ మరిచిపోలేమన్నారు. పుష్పగుచ్ఛం అందజేసి దుశ్శాలువతో సత్కరించి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా కళాశాలలో జరుగుతున్న అడ్మిషన్లు, నాడు-నేడు అభివృద్ధి పనుల గూర్చి సిబ్బంది ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే మైనార్టీ విద్యార్థుల కొరకు ఉర్దూ మీడియంను కొనసాగించేలా చొరవ చూపాలని విన్నవించగా.. రీజనల్ జాయింట్ డైరక్టర్ తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలియజేశారు. కళాశాల అభివృద్ధికి సంబంధించి ఎటువంటి సాయం చేయడానికైనా ఎల్లవేళలా తాను సిద్ధంగా ఉంటానని తెలియజేయడంతో అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.సరళా కుమారి, లెక్చరర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ జీఎన్ఆర్, అధ్యాపకులు తేజ, వెంకట్, రాంబాబు, జవహర్ బాబు, సీతారాం, నజీర్, విజయ, జి.ఎస్.కే విద్యాసాగర్, ఆఫీస్ సిబ్బంది ప్రభాకర్, తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *