Breaking News

సెంట్రల్ నియోజకవర్గంలో 2,042 మందికి కాపునేస్తం : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మూడో విడత కాపు నేస్తం ద్వారా సెంట్రల్ నియోజకవర్గంలో 2,042 మంది అక్కచెల్లెమ్మల ఖాతాలలో రూ. 3 కోట్ల 6 లక్షల 30 వేల నిధులు శుక్రవారం జమ చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ కళ్లల్లో ఆనందం చూడాలనే దృఢ సంకల్పంతో జగనన్న ప్రభుత్వం పనిచేస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. అగ్రవర్ణాలలోనూ పేదలు ఉన్నారని గుర్తించిన తొలి ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా ఏటా రూ.15 వేల సాయం అందించడం జరుగుతోందన్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1,107 మందికి రూ. కోటి 66 లక్షల 5 వేలు., 2021-22 ఆర్థిక సంవ‌త్సరానికి గానూ 1,869 మంది ఖాతాలలో రూ. 2 కోట్ల 80 లక్షల 35 వేలు జ‌మ‌చేయ‌డం జ‌రిగిందన్నారు. లబ్ధిదారుల సంఖ్య ఏటా పెరుగుతున్నా సరే ప్రభుత్వం ఏమాత్రం వెనకడుగు వేయకుండా పథకాన్ని అమలు చేస్తోందని మల్లాది విష్ణు తెలియజేశారు. ప్రతి సంక్షేమ పథకంలోనూ మహిళలనే ప్రధాన లబ్దిదారులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన మహిళలు ఆయా పథకాలను సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *