విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణుని మంత్రాలయం ప్రతినిధులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆగష్టు 10 నుంచి 16 వరకు జరుగు శ్రీ రాఘవేంద్ర స్వామి 351వ ఆరాధన మహోత్సవాలకు విచ్చేయవలసినదిగా ఆహ్వానించారు. ఈ మేరకు ఆంధ్రప్రభకాలనీలోని జనహిత సదనములో ఆహ్వానపత్రికను అందజేశారు. కార్యక్రమానికి తప్పక విచ్చేసి స్వామి వారి దివ్య ఆశీస్సులు అందుకోవాలని కోరగా.. హాజరవుతానని మల్లాది విష్ణు తెలియజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మఠం పీఆర్వో నరసింహమూర్తి, సూపరింటెండెంట్ పురాణిక్ ఉన్నారు.
Prajavartha Online Telugu News