Breaking News

సంక్షేమ పథకాల అమలుతో ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల వద్దకు వెళుతున్న సందర్భంలో తమకు దక్కుతున్న ఆదరణ ఆప్యాయత అపూర్వమని,గ్రామ గ్రామాన ప్రతి ఒక్కరు తమకు అందుతున్న సంక్షేమ పథకాల అమలు విషయంలో చాలా సంతోషంగాఎంతో సంతృప్తిగా ఉన్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో పోలవరం గ్రామంలో రాచర్లపాలెం రోడ్డులోని పాతసినిమా హాలు ప్రాంతంలో ‘ గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం గురువారం ప్రారంభించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో మంత్రి జోగి రమేష్ విస్తృతంగా ప్రతి ఇంటికివెళ్ళి వివిధ లబ్ధిదారుల నుండి ప్రభుత్వం అందించే పథకాలు వివరాలు ఆయన తెలుసుకొన్నారు. తొలుత బండి కస్తూరి, కారపర్తి కనక దుర్గ, కటకం లక్ష్మోజి, బట్ట విమల, బట్టమధుసూధనరావు, పిచ్చుక నాగమణి, బులసరి కమల, పిచ్చుక ఈశ్వరరావు, బులసరి యోగానంద్, బూసంసరళాదేవి, కారపర్తి ప్రసన్నాంబ, ఉమ్మిటి జ్యోతి, నున్న నాగలక్ష్మి, బీరక బాలమృత్యంజయరావు, కోట శ్యామల, కటకం గోపాలరావు, పుల్లేటి గాంధీ ధనలక్ష్మి, కటకం వెంకట సుబ్బమ్మ, గంగుల విజయలక్ష్మి, జోగాబత్తుల కోటేశ్వరావు తదితరుల ఇళ్లకు వెళ్లిన మంత్రిజోగి రమేష్ వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా అనిపలువురు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ఈ మూడు సంవత్సరాల్లో వివిధ సంక్షేమపథకాల ద్వారా పోలవరం గ్రామంలో పిచ్చుక రాజ్యలక్ష్మి అనే మహిళా లబ్ధిదారుని కుటుంబానికి8 లక్షల 29వేల రూపాయలను జగనన్న ప్రభుత్వం అందచేసిందని తెలియచేశారు, కోవిడ్‌తో ఆదాయంఅడుగంటినా సామాన్యుల కష్టాలే ఎక్కువని భావించిన ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి 2021లో ఏ ఒక్క పథకాన్ని ఆపకుండా నిరాటంకంగా అమలు చేశారని తెలిపారు. ఆకష్ట సంక్షోభంలో పేదలను గట్టెక్కించారని ముందుగా ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్‌నుఅనుసరిస్తూ మాట ప్రకారం పథకాలను అమలు చేసిన ఘనత దేశంలో మన ముఖ్యమంత్రికి మాత్రమేదక్కిందన్నారు. కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతిలోనూ రైతులతో పాటు అన్ని వర్గాలను ఆదుకున్నసహృదయం ఈ ప్రభుత్వానికే దక్కిందన్నారు. 2021 ఆర్ధిక సంవత్సరంలో వివిధ వర్గాల కోసం సీఎంజగన్‌ ఏకంగా రూ.99,535.88 కోట్ల కార్యక్రమాల అమలు ప్రారంభించారని మంత్రి జోగి రమేష్వివరిస్తూ, ఒక్క పెన్షన్ల కోసమే రూ.17,400 కోట్లు వ్యయం చేయగా వివిధ పథకాల ద్వారా మరోరూ.33,301.88 కోట్లను ప్రజల ఖాతాలకు జమ చేశారన్నారు. . ఇవి కాకుండా పేదల కోసం తొలిదశలో15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని రూ.28,084 కోట్లతో చేపట్టారని తెలిపారు. ఇంటిపై రుణంతీసుకుని ఎలాంటి హక్కులు లేని పేదలకు సర్వహక్కులు కలి్పంచేందుకు ఓటీఎస్‌ పథకాన్ని తెచ్చరూ.16,000 కోట్లు లబ్ధి చేకూర్చడం గమనార్హం అన్నారు. పేద కుటుంబాల ఉచిత బీమాకు రూ.750కోట్ల ప్రీమియం చెల్లించగా పాడిని నమ్ముకున్న అక్క చెల్లెమ్మల కోసం రూ.4,000 కోట్లతోబల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ కేంద్రాలు, ఆటోమెటిక్‌ పాల సేకరణ కేంద్రాల నిర్మాణం చేపట్టడంఎంతో అపూర్వమైన విషయమని మంత్రి జోగి రమేష్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పోలవరం సర్పంచ్ నక్కిన వెంకట నాగరాజు, ఎం పి పి బొల్లా గంగాధరరావు, గూడూరు మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ గరికపాటి రామానాయుడు, బూసం గిరిజ, మెరుగు వెంకన్, పిచ్చుక గంగాధర్, గూడూరు తహశీల్ధార్ విజయ ప్రసాద్, ఎం పి డి ఓ సుబ్బారావు, వి ఆర్ ఓ కుందేటిఉషారాణి, షేక్ ముజుబూర్ రెహ్మాన్, పుప్పాల రాంబాబు, గుడివాడ నాగ సంపత్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ సచివాలయవాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *