-సరిగ్గా101 సంవత్సరాల 4 నెలల క్రితం..1921 మార్చి 31వ తేదీ.
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లోని నేటి బాపూ మ్యూజియం.. నాడు విక్టోరియా జూబిలి మహల్.అందులోని సమావేశ మందిరంలో మహాత్మాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీసమావేశాలు జరిగాయి. అప్పటికే గాంధీ, పింగళి వెంకయ్య జాతీయ పతాకంరూపకల్పనపై పలుమార్లు మాట్లాడారు. ఈ సమావేశంలోనే వెంకయ్యకు జాతీయపతాక రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయన మూడు గంటల వ్యవధిలోనే తనసహ అధ్యాపకుడు అయిన ఈరంకి వెంకటశాస్త్రి సహకారంతో జెండా నమూనాతయారుచేసి గాంధీకి అప్పగించారు. ఎరుపు, ఆకుపచ్చ రంగులతో పాటు చరఖా రాట్నంచిహ్నం అందులో ఉంది. ఆ తర్వాత జరిగిన మరో సమావేశంలో గాంధీ పలు సూచనలుచేశారు.జెండాలో మార్పులుఇలా ఎరుపు, ఆకుపచ్చ, తెలుపు రంగుల మధ్యలో రాట్నం గుర్తుతో జాతీయపతాకం తయారు చేశారు. 1931లో కరాచీలో జరిగిన కాంగ్రెస్ మహాసభల్లో సిక్కులు పతాకంలోని రంగుల గురించి సమస్య లేవనెత్తారు. ఈ నేపథ్యంలోనేనెహ్రూ, మౌలానా అబుల్ కలాం అజాద్,భోగరాజు పట్టాభి సీతారామయ్య, తారాసింగ్, దత్తాత్రేయ బాలకృష్ణతో కూడిన కమిటీ సూచనల ప్రకారం..
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో ఉన్న పతాకంపై రాట్నం ఉండేలావెంకయ్య జెండాలో మార్పులు చేశారు. ఈ మార్పును కాంగ్రెస్ జాతీయమహాసభ ఆమోదించింది.పునాది పడింది విజయవాడలోనే..జాతీయ పతాకానికి, పార్టీ జెండాకు మధ్య వ్యత్యాసం ఉండాలనేఆలోచనతో.. 1947 జులై 22న ప్రకటించిన ప్రకారం జాతీయ పతాకంలో కాషాయం,తెలుపు, ముదురు ఆకుపచ్చ రంగుల పట్టీలతో.. మధ్యలో నీలిరంగులో అశోకునిధర్మచక్రం ఉండేలా నిర్ణయం తీసుకొని మార్పులుచేశారు. ఈ చారిత్రకఘట్టాలకు పునాది పడిందిపింగళి వెంకయ్య.. ‘భారత జాతీయ పతాక రూపశిల్పి…’ అనేది తెలుగు వారేకాదు.. భారతీయులు చాలా మంది చెప్పే మాట. చిన్నప్పటినుంచిపాఠ్యపుస్తకాల్లో చదవుకున్న మాట. తెలుగు ఆంగ్ల పత్రికల రిపోర్ట్స్‌లోతరచుగా అలాగే ప్రస్తావిస్తూ ఉంటారు. కానీ.. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటుప్రభుత్వానికి చెందిన అధికారిక వెబ్‌సైట్లలో కనిపించే జాతీయ పతాకచరిత్రలో ఎక్కడా పింగళి వెంకయ్య పేరు ప్రస్తావన లేదు.ప్రభుత్వ వెబ్‌సైట్‌లో మాత్రం.. 1921లో బెజవాడలో జరిగిన ఆల్ ఇండియాకాంగ్రెస్ కమిటీ సదస్సులో ‘ఒక ఆంధ్రా యువకుడు’ ఒక జెండాను తయారు చేసి
గాంధీకి చూపించారు అని ప్రస్తావించారు. అయితే.. 2009లో భారత ప్రభుత్వంపింగళి వెంకయ్య స్మారక పోస్టల్ స్టాంపు విడుదల చేసింది.పింగళి వెంకయ్యకు భారతరత్న ప్రదానం చేయాలని 2011లో అప్పటిఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఫారసు చేసింది. అదేమీ కార్యరూపందాల్చలేదు నిజానికి.. భారత జాతీయ పతాకం రూపకల్పనలో చాలా చరిత్ర ఉంది.స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ఈ పతాకం పురుడుపోసుకుంది. ఇప్పుడున్నరూపానికి రాకముందు అనేకమార్పులకులోనయింది. అందులో పింగళి వెంకయ్యరూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైనదని.. ఇప్పటి జాతీయ పతాకానికి అదేమాతృక అని.. చరిత్ర పుస్తకాల్లో చెప్తారు. పాఠ్యపుస్తకాల్లోనూ జాతీయపతాక నిర్మాత పింగళి వెంకయ్య అని బోధిస్తున్నారు.కానీ.. ఈ అంశంపై స్పష్టత లేదు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో అనేకరకాలుగా మారిన జెండాల్లో పింగళి రూపొందించిన జెండా ప్రధానమైనదేఅయినప్పటికీ.. ఇప్పటి జాతీయ పతాకం దానికి భిన్నమైనదని పలువురువాదిస్తున్నారు. జాతీయ జెండాకు ఇప్పటి తుదిరూపం రావడంలో.. హైదరాబాద్‌కు చెందినఆడపడుచు సురయ్యా తయాబ్జీ ప్రధాన పాత్ర పోషించారన్నది ఇందులో ఒకటి.నిజానికి.. ఆమె భర్త బద్రుద్దీన్ ఫయాజ్ తయాబ్జి 1947లో ప్రధానమంత్రికార్యాలయంలో ఐసీఎస్ అధికారిగా పనిచేస్తున్నారని.. 1931లో కాంగ్రెస్ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలోని చరఖా స్థానంలో అశోక చక్రంఉంచాలని ఆయన సూచించారని.. ట్రెవర్ రాయల్ తనపుస్తకం ‘ద లాస్ట్ డేస్ఆఫ్ ద రాజ్’ పుస్తకంలో రాశారు.అశోక చక్రంతో కూడిన జాతీయ పతాకం నమూనాను ఆయన భార్య సురయ్యాతయాబ్జీ తయారు చేయగా.. 1947 ఆగస్టు 15న తొలి ప్రధానమంత్రిజవహర్‌లాల్ నెహ్రూ ఆ జెండాను తన కారు మీద ఉపయోగించారని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News