విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పై నిర్వహించిన అవగాహన ర్యాలీలో శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ పాల్గొన్నారు.పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 181 , 182 సచివలయలకు సంబందించి కొత్తపేట చేపల మార్కెట్ వద్దన గల షాదీ ఖానా నందు ఏర్పాటు చేసిన ఆజాదీ కా అమృత్ మహోత్సవము పై ప్రజలకు అవగాహన కార్యక్రమములో శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) గారితో కలసి పాల్గొన్నారు. ముందుగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మరియ సచివాలయ సిబ్బందితో కలసి 50 మీటర్ల పొడవు గల త్రివర్ణ పతాకముతో ర్యాలి నిర్వహించారు. తదుపరి షాదీ ఖానా నందు జాతిపిత మహత్మా గాంధీ గారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘన నివాళ్ళు అర్పించి విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నేటి నుండి 15వ తేది వరకు నగరంలో చేపట్టిన వివిధ కార్యక్రమములలో ప్రజలందరూ స్వచ్చందంగా భాగస్వాములై విజయవంతము చేయాలని శాసన సభ్యులు శ్రీ వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి పిలుపునిచ్చారు.
ఈ సందర్బంలో కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ వార్డ్ సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఒక్కరులో దేశ భక్తిని నింపే విధంగా డివిజన్ పరిధిలో పలు కార్యక్రమములను నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, సచివాలయ సిబ్బంది ద్వారా ప్రభుత్వం ద్వారా ఇంటింటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణి చేయుట జరుగునని, 13వ తేది నుండి 15వ తేదివరకు ప్రతి ఇంటిపై సదరు జండా ఎగురవేయాలని సూచించారు. అదే విధంగా 15వ తేదీవరకు నిర్వహించనున్న కార్యక్రమము అందరు పాల్గోనాలని అన్నారు.
కార్యక్రమములో శాంతి కల్చరల్ సొసైటి కళాజాతర బృంద దేశ భక్తీ గేయాల ఆలపించగా కార్యక్రమములో జోనల్ కమిషనర్ సుధాకర్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు.సి.డి) శకుంతల మరియు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News