విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నూతనంగా ఏర్పాటు చేసిన టిడ్కో హౌసింగ్ స్పెషల్ సెల్ (రిజిస్ట్రేషన్ సెల్) ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, అధికారులతో కలసి ప్రారంభించారు. టిడ్కో గృహాలకు సంబంధించిన ప్రజలలో ఎదురోతున్న సందేహాలను నివృతి చేయుటకు లబ్దిదారులకు అందుబాటులో ఉండే విధంగా అధికారులు మరియు సిబ్బందిని నియమించుట జరిగిందని, నగర పరిధిలో సుమారుగా 6000 మందికి టిడ్కో ఇళ్ళు మంజూరు కాబడినవని, దానిలో 2000 ఇళ్ళు మాత్రమే నిర్మాణం పూర్తి చేయుట జరిగిందని, మిగిలినవి డిసెంబర్ నాటికీ పూర్తి అవుతాయని అన్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్యక్రమము చేపట్టుట జరిగిందని, ప్రజలు నేరుగా వచ్చి వారి యొక్క సమస్యలను జాయింట్ డైరెక్టర్ హౌసింగ్ అధికారికి వివరించి సమస్యలను పరిష్కరించుకొన వచ్చునని సింగల్ విండో సిస్టమ్ ద్వారా టిడ్కో ఇళ్ళకు సంబందించి అన్ని అంశాలను ఇక్కడ పరిష్కరించుట జరుగుతుందని కమిషనర్ పేర్కొన్నారు. అదే విధంగా మేయర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం సుమారుగా 13 వేల మందికి పైగా లబ్దిదారులు డబ్బులు చెల్లించి ఇళ్ళు కేటాయించకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇళ్ళు నిర్మాణం చేయకుండా డబ్బులు వసూలు చేయుట ద్వారా ప్రజలు పడుతున్న ఆవేదనను దృష్టిలో ఉంచుకొని కేవలం 6000 ఇళ్ళ మాత్రమే నిర్మాణం చేపట్టిన దర్మిల ఇళ్ళు మంజూరు కానీ లబ్దిదారులకు నగదు చెల్లించుటకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సానుకూలంగా స్పందించి 10 కోట్లు నిధులు మంజూరు చేయగా వాటిని ఆయా లబ్దిదారులకు జమ చేయటం జరిగిందని త్వరలోనే మిగిలిన వారికీ కూడా జమ చేయుట జరుగుతుందని వివరించారు. ఇళ్ళు మంజూరు కబాడీ పూర్తి డాకుమెంట్స్ ఉన్న లబ్దిదారులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించుట జరిగిందని అన్నారు. కార్యక్రమము అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, జాయింట్ డైరెక్టర్ (అమృత్) డా.కె.బి.ఎన్.ఎస్ లతా తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News