-ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పోస్టర్ ఆవిష్కరణ
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా ప్రభుత్వం వారి ఆదేశాలకు అనుగుణంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ది.01-08-2022 నుండి 15-08-2022 వరకు (15 రోజులు) పాటు నిర్వహించ తలపెట్టిన కార్యక్రమములకు సంబందించిన పోస్టర్ ను నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, నగరపాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు అధికారులతో కలసి ఆవిష్కరించారు. నగరంలో నేటి నుండి 15 రోజుల పాటు అనగా 15-08-2022 వరకు నగర పరిధిలో వార్డ్ సచివాలయాల మరియు డివిజన్ లలోని చోట్ల అనేక కార్యక్రమములను నిర్వహించుటకు తగిన చర్యలు తీసుకోవటం జరిగిందని, దానిలో భాగంగా వ్యాస రచన పోటీలు, పెయింటింగ్, జింగల్స్, మోనో ఆక్షన్, పేట్రియాటిక్ డ్రామా / పాటలు, వాల్ పెయింటింగ్ తిరంగా సేల్ఫీ వంటి అనేక కార్యక్రమములను నిర్వహించుట జరుగుతుందని వివరిస్తూ, ప్రజలు స్వచ్చందంగా పాల్గొని ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను విజయవంతము చేయాలని పిలుపునిచ్చారు. ముందుగా కమిషనర్ అధికారులతో కలసి మహాత్మాగాంధీ చిత్ర పట్టానికి పూల మాలలు వేసి నివాళ్ళు అర్పించారు.
Prajavartha Online Telugu News