Breaking News

కొత్త పెన్షన్ పంపిణి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 181 , 182 సచివాలయలకు సంబందించి కొత్తపేట చేపల మార్కెట్ వద్దన గల షాదీ ఖానా నందు ఏర్పాటు చేసిన కొత్త పెన్షన్ పంపిణి కార్యక్రమములో శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) తో కలసి కొత్త మంజూరు కాబడిన లబ్దిదారులకు పెన్షన్ నగదు అందించారు.

ఈ సందర్బంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 1073 మందికి కొత్తగా పెన్షన్ మంజూరు అయినట్లు, ఈ 52వ డివిజన్ అందు 93 కొత్త పెన్షన్ లు మంజూరు అయినట్లు పాల్గొన్నారు. డా.వై.ఎస్.ఆర్ ఆశయాలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించాలనే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం సచివాలయాల వ్యవస్థ ద్వారా కులాలు మరియు పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఒకటోవ తారీఖునే వార్డ్ వాలెంటరీల ద్వారా నేరుగా లబ్దిదారుల ఇంటి వద్దేనే పెన్షన్ అందించుట జరుగుతుందని అన్నారు. 60 సంవత్సరాల పెబడిన వారందరికి రూ.2500/- మొత్తం వారి అవసరాలకు ఖర్చు చేసుకొనేలా అందించుట జరుగుతుందని వివరించారు.

నగరపాలక సంస్థ కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ మూడు సర్కిల్ కార్యాలయాల పరిధిలో మొత్తం 4200 మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు అయినవని, ఇంకను అర్హులైన వారoదరికి వృద్దాప్య, వితంతు, వికలాంగుల వంటి పెన్షన్లను మంజూరు చేయటం జరుగుతుందని, అర్హత ఉండి పెన్షన్ అందని వారు నేరుగా వారి పరిధిలోని సచివాలయానికి వెళ్లి అర్జి సమర్పించిన యెడల పరిశీలించి పెన్షన్ మంజూరు చేయటం జరుగుతుందని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *