రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శేనాధిపత్యం ఉపేంద్ర కి దివ్యంగుల సామాజిక భద్రత పెన్షన్ పునరుద్దరణ కోసం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కే . మాధవీలత పేర్కొన్నారు. బుధవారం నరగ పాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన జిల్లా కలెక్టర్ ను కలిసిన ఎస్. ఉపేంద్ర మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలా రెడ్డి సమక్షంలో పెన్షన్ పునరుద్దరణ కోసం దరఖాస్తు అందచేశారు. ఈ సందర్భంగా ఆర్యపురంకి చెందిన సేనాధిపత్యం ఉపేంద్ర వివరాలు తెలుపుతూ తనకు 2004 నుంచి దివ్యాంగుల కి ప్రభుత్వం ఇచ్చే సామాజిక భద్రత పెన్షన్ వస్తోందన్నారు. తన తల్లికి వితంతు పెన్షన్ పథకం ద్వారా పెన్షన్ ఇస్తున్నట్లు తెలిపారు. పోలియో బారిన పడిన తాను ప్రభుత్వం అందచేసే పెన్షన్ పథకం పై ఆధారపడి ఉన్నానని, తన తల్లి వృద్ధాప్యం వలన నాకు వొచ్చే పెన్షన్ ఆసరాగా ఉపయోగ పడుతున్నట్లు తెలియచేసారు. ఒకే రేషన్ కార్డు లో తన పేరు, తల్లి శేనాధిపత్యం లక్ష్మి నర్సమాంబ పేరు ఉండడం వలన ఈ నెల నాకు ప్రతినెలా వస్తున్న దివ్యాంగుల పెన్షన్ నిలుపుదల చేశారని, ఈనెల పెన్షన్ సొమ్ము రాలేదని విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ డా కె. మాధవీలత అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. సేనాధిపత్యం ఉపేంద్ర కి దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరణ కోసం ప్రభుత్వానికి లేఖ రాయడం జరుగుతుందని మాధవీలత తెలియ చేశారు. ప్రత్యేక పరిస్థితిగా పరిగణన లోకి తీసుకుని ఉపేంద్రకు దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరణ కై చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Prajavartha Online Telugu News