Breaking News

చిరు గుడిసెలు చిరుదీపం బ్రతుకుల నుండి కరెంట్‌ వెలుగులలోకి గిరిజన కుటుంబాలు…

-కుల మతాలకు అతీతంగా సహజీవన జగనన్న కాలనీలలోనే సాధ్యం..
-ముఖ్యమంత్రి ఇచ్చిన మాటలో నెరవేరిన పేదల సొంతింటి కల.
-జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చిరు గుడిసెలలో దీపం బుడ్డి వెలుగుల మధ్య జీవిస్తున్న గిరిజన కుటుంబాలు నేడు కరెంటు వెలుగులతో పక్కా గృహాలలో నివసించగలిగేలా పేదలందరికి పక్కా గృహలు నిర్మిస్తానని ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం పేదలకు సొంతింటి కల సాకారమైందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
విజయవాడ రూరల్‌ మండలం జక్కంపుడి గ్రామంలోని జగనన్న కాలనీలో గిరిజన కుటుంబాలకు నిర్మించిన 22 పక్కా గృహాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు స్థానిక శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి పేదలకు సొంతింటి కల నేరవేరుస్తానని ఇచ్చిన మాట ప్రకారం జగనన్న కాలనీల ద్వారా సొంతింటి కలను నేరవేర్చుకున్న లబ్దిదారుల కళ్ళల్లో ఆనందాన్ని చూడగలుగుతున్నామన్నారు. పూరిగుడిసెలలో దుర్భరమైన జీవితం గడుపుతూ దీపపు బుడ్డి వెలుతురులో చీకటి జీవితాన్ని గడిపే 22 మంది యానాది కులానికి చెందిన గరిజన కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి కరెంట్‌ వెలుతురులో నివసించేలా చేయడం ద్వారా వారి జీవితాలలో నిజమైన వెలుగులను నింపినట్లైయిందదన్నారు. సమాజంలోని అన్ని వర్గాల వారితో కలిసి మెలిసి జీవించే అవకాశం కల్పించేందుకు జగనన్న కాలనీలలో గిరిజనలకు గృహలను మంజూరు చేయడం జరిగిందన్నారు. తద్వారా సమానత్వాన్ని తీసుకువచ్చిన్నట్లయిందన్నారు. గృహ నిర్మాణ శాఖ ద్వారా రూ.1.80 లక్షలు మంజూరు, గిరిజన కార్పొరేషన్‌ ద్వారా మరో రూ.2.00 లక్షల మంజూరు చేసి రూ. 3.80 లక్షలతో పక్కా గృహలను నిర్మించడం జరిగిందన్నారు. జక్కంపూడి గ్రామంలో 165 గృహలను మంజూరు చేయడం జరిగిందని వాటిలో 140 గృహాలు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయని మరో రెండు మాసలలో గృహ నిర్మాణాలను పూర్తి చేసి మౌలిక వసతులను కల్పిస్తారన్నారు. 22 మంది యానాది కులానికి చెందిన గిరిజన కుటుంబాలకు సొంతింటి కల నేరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రికి మరియు నిర్మాణాలను పూర్తి చేయడంలో భాగస్వామ్యలైన స్థానిక శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్‌ను సంబంధిత అధికారులను అభినందింస్తున్నానని కలెక్టర్‌ అన్నారు.
స్థానిక శాసన సభ్యులు వసంత కృష్ణ ప్రసాద్‌ మాట్లాడుతూ నిరాదరణకు గురైన అణగారిన వర్గాలను అక్కున చేర్చుకున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి వైస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామిని అమలు పరుస్తున్నారన్నారు. పేద అక్కా చెల్లెమ్మకు సొంతింటి కల నేరవేర్చటం అవ్వతాతలకు అండగా పెన్షన్‌ మంజూరు ఆరుగాల కష్టపడే రైతన్నకు భరోసా ఇవ్వడం పేద విద్యార్థుల ఉన్నత విద్యకు బాటలు వేస్తూ అమ్మఒడి, జగనన్న విద్య కానుక, జగనన్న తోడు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు. స్వార్థ ప్రయోజనాలతో ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలకు ఇప్పటికైన స్వస్తి పలకాలని ఆయన అన్నారు.
కార్యక్రమంలో గృహా నిర్మాణ శాఖ జిల్లా పిడి ఏ శ్రీదేవి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిని కూర్మానందరావు , డ్వామా పిడి స్థానిక యంపిడివో జె. సునీత, యంఆర్‌వో శ్రీనివాస్‌ నాయక్‌, హౌసింగ్‌ ఇఇ నాగమల్లేశ్వరరావు, యంపిపి సిహెచ్‌ ప్రసన్న కుమారి, జడ్పిటిసి కె. సువర్ణరాజు, ఏయంసి చైర్మన్‌ సురేష్‌, గ్రామ సెక్రటరి టి. భారతి, స్పెషల్‌ ఆఫీసర్‌ అనంద్‌కుమార్‌, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *