మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మహ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమాం హుస్సేన్ , ఆయనతో పాటు 70 మంది అమరవీరుల పవిత్ర బలిదానానికి, పంజాల మరమ్మత్తుల కోసం జగనన్న ప్రభుత్వం,తానూ ఒక చిన్న మద్దతు ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి, కృష్ణాజిల్లా వైఎస్సార్సిపి అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్థానిక ఇనగుదురుపేట సకీనా ఫంక్షన్ హాల్ లో మొహరం పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ద్వారా ఒక్కొక్క ఆషూర్ ఖానాలకు ( పంజాలకు ) 5 వేల రూపాయల చొప్పున 95 పంజాలకు ప్రోత్సాహక నగదు మొత్తం 4 లక్షల 75 వేల రూపాయలను ఎమ్మెల్యే పేర్ని నాని, రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ ఖాదర్ బాషా పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) మాట్లాడుతూ, రాష్ట్రంలోని 26 జిల్లాలలో అత్యధిక సంఖ్యలో షీయా సోదరులు ఉన్న ప్రాంతం మచిలీపట్నం అని, ఆ సాంప్రదాయంలో అశువులు బాసిన మహనీయులను స్మరించుకొంటూ వారి పేరిట పంజాలను నిర్మించుకొని కర్బాలా యుద్ధం నాటి విషాద జ్ఞాపకాలను మననం చేసుకునే సాంప్రదాయం కులమతాలకు అతీతంగా మచిలీపట్నంలో దశాబ్దాల తరబడి కొనసాగడం గమనార్హమన్నారు
షియాలు అందరూ గతంలో నవాబులేనని గోల్కొండ నవాబుల ఏలుబడిలో పూర్వం బందరు పట్టణం ఉండేదని, బందరు కోటను డచ్చి వారికి ఫ్రెంచ్ వారికి, బ్రిటిష్ వారికి లీజుకు ఇచ్చిన చారిత్రాత్మక నేపధ్యం ఉందని , గోల్కొండ నవాబుల ఆస్తుల అజమాయిషీ చేయడానికి వారి బంధువులను ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పర్చుకొన్నారని ఇది తన అవగాహన అని ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. అది గత ఘనకీర్తి అని , ప్రస్తుతం పేరుకే నవాబులని తాము భక్తిశ్రద్దలతో నిర్మించుకున్న పంజాకు ఏదైనా మరమ్మత్తు చేయాల్సివస్తే, బాగుచేయించుకోలేని ఆర్ధిక పరిస్థితులు అత్యధిక శాతం మంది షీయా సోదరులలో నెలకొన్నాయన్నారు. నవాబుల సంప్రదాయాన్ని గౌరవిస్తూ, మొహరం దుఖః దినాలలో ఏ ఒక్కరి మెహర్బానీకి తావులేకుండా పంజాల ఆలనా పాలనకు దేవుని సొమ్ము దేవునికె ఇచ్చేందుకు తమను భగవంతుడు ప్రేరేపించారని ఎమ్మెల్యే పేర్ని నాని హర్షద్వానాల మధ్య ప్రకటించారు. మొహరం దుఖః దినాలు సందర్భంగా నగరంలోని అన్ని పంజాల వద్ద మౌలిక వసతులు కల్పిస్తున్నట్టు తెలిపారు. మొహరం దుఖః దినాలు 11 రోజుల పాటు పంజాల వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనే ముస్లిం సోదరులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అలాగే మొహరం రోజున కోనేరుసెంటర్ లో జరిగే చెస్ట్ బీటింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు.
అనంతరం రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ ఖాదర్ బాషా ప్రసంగిస్తూ, ముస్లీమ్ సోదరుల పట్ల స్నేహ భావంతో మెలిగే మంచి వ్యక్తి ఎమ్మెల్యే పేర్ని నాని అని విన్నాను కానీ, నేడు ఆయనలో తమ పట్ల ఉన్న మంచి భావనలు తనను ఎంతో ఆకట్టుకొన్నాయనున్నారు. సరిగా విస్తరించాలంటే, ఒక కోడి తన పిల్లలను ఎలా కాపాడుకొంటుందో ఆ తరహాలో ఆయన ఇక్కడ తమను రక్షించుకొంటున్న తీరు తనకు ఎంతో ముచ్చట కలిగిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, మచిలీపట్నం మాజీ మునిసిపల్ ఛైర్మెన్, మచిలీపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు షేక్ సలార్ దాదా, వైస్సాఆర్ సిపి అధికార ప్రతినిధి మాదివాడ రాము, మచిలీపట్నం మార్కెట్ యార్డ్ ఛైర్మెన్ షేక్ ముస్తఫా ( అచ్చాబా ), రషిద్ మౌలాన, ఇనయిత్ హుస్సేన్, మీర్ జాఫర్ ఆలీ, మీర్జా రియాజ్ హుస్సేన్, కార్పొరేటర్లు డివిజన్ ఇంచార్జ్ లు మీర్ అస్గర్ అలీ, రఫీ, ఇక్బాలి, సాహెబ్, నజఫ్ ఆలి, కరార్ ముసావి, జమీల్ ఖాన్, అబ్రారర్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News