Breaking News

దేశ నాయకులను స్మరించుకొనవలసిన అవ్యస్యకత ఎంతో అవసరం

-ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమములో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో పశ్చిమ నియోజకవర్గo పాత శివాలయం వద్ద ఏర్పాటు చేసిన జాతీయ నాయుకుల విగ్రహాల శుభ్రపరచు కార్యక్రమములో శాసన సభ్యులు  వెల్లంపలి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, తదితరులు పాల్గొని అక్కడ ఉన్న సర్దార్ వలభాయి పటేల్ గారి విగ్రహమునకు రంగులు మరియు పూలమాలలు వేసినారు.

ఈ సందర్బంలో శాసన సభ్యులు వెల్లంపలి శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తంగా రాష్ట్ర స్థాయిలో ఆగష్టు 14వ తేదీ వరకు పలు కార్యక్రమములను నిర్వహించుట జరుగుతుందని, దీనిలో భాగంగా మొదటి రోజు అవగాహన కార్యక్రమములు, నిన్న జాతీయ పతాక రుపకల్ప శ్రీ పింగళి వెంకయ్య జయంతిని జరుపుకోవటం జరిగిందని, అదే విధంగా నేడు జాతీయ నాయుకుల విగ్రహములను శుభ్రపరచు కార్యక్రమాలను నిర్వహించుటం జరుగుతుందని అన్నారు. ఆగష్టు 13 నుండి 15వ తేది వరకు నగరంలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం జాతీయ జండాను ఎగురవేసి ప్రతి ఒక్కరిలో జాతీయ స్పూర్తి కలిగే విధంగా కార్యక్రమము విజయవంతము చేయాలని పిలుపునిచ్చారు.

అదే విధంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలో ది.01-08-2022 నుండి 15-08-2022 వరకు రోజుకు ఒక కార్యక్రమము నిర్వహించుట జరుగుతుందని, దానిలో భాగంగా స్వాతంత్రం సాధనలో పోరాడిన ఎందరో మహానుభావులను స్మరించుకోనుచు నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న ఆయా మహానుభావుల విగ్రహాలను శుభ్రపరచుకోవటం జరుగుతుందని అన్నారు. నగర పరిధిలో వార్డ్ సచివాలయాల మరియు డివిజన్ లలోని ప్రజలకు స్పూర్తి కలిగేలా అనేక కార్యక్రమములను నిర్వహించుట జరుగుతుందని, ముఖ్యంగా నేటి యువత చిన్నారులకు స్వాతంత్ర ఉద్యమములో పోరాడిన త్యాగమూర్తుల గురించి తెలుసుకొని వారు దేశానికీ చేసిన సేవలను కీర్తించుకొనవలసిన అవసరము ఎంతో ఉండదని అన్నారు.

కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ద్వారా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహిస్తున్నకార్యక్రమములలో ప్రజలు స్వచ్చందంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ, దేశ భక్తని పెంపొందించే విధంగా సచివలయాల సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా జాతీయ జండాను అందించుట జరుగుతుందని వాటిని గౌరవంగా మీ మీ భవనములపై ఎగురవేయాలని అన్నారు.

కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ మండెపూడి ఛటర్జీ, అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, జోనల్ కమిషనర్ సుధాకర్ మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *