Breaking News

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు…


రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా బుధవారం  బొబ్బిలంకలోని సుబ్బారావు పేట అంగనవాడి కేంద్రం నందు తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతను బొబ్బిలంక ఉప ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది వివరించారు. తల్లిపాలలో అన్ని రకాల పోషకాలు ఉంటాయి, ఎట్టి పరిస్థితులలోనూ 6 నెలల వరకు బిడ్డకు నీళ్లు, తేనె ఇతర ఆహార పానీయాలు ఇవ్వరాదు అని వివరించారు. బిడ్డ పుట్టిన గంటలోగా వీలైనంత త్వరగా తల్లిపాలు ఇవ్వాలని తెలియజేశారు. తల్లి నుండి మొట్టమొదట వచ్చే ముర్రుపాలు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుండది వివరించారు .తల్లి పాలు తాగడం వలన బిడ్డ మేదస్సు పెరుగుతుందని తెలియజేశారు. పాపాయికి నలతగా ఉన్నప్పటికీ మొదటి ఆరు నెలల వరకు తల్లిపాలు తాగిస్తూనే ఉండాలి ఆరు నెలల తర్వాత తల్లిపాలతో పాటు ఇతర ఆహారం తక్కువ మోతాదులో తినిపించాలని తెలియజేశారు. తల్లిపాలు తాగించడంలో ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ANM, MLHP, ఆశ లేదా అంగన్వాడి కార్యకర్తలను సంప్రదించవలసినదిగా చూపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లులకు పౌష్టికాహారాన్ని అందించుట జరిగింది. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు 1 ఆగస్టు 2022 నుండి 7 ఆగస్టు 2022 వరకు జరుగుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి బొబ్బిలంక సర్పంచ్ మెల్లిమీ రామచంద్ర రావు, K.శ్రీనివాసరావు హెల్త్ సూపర్వైజర్, సూర్య కుమారి హెల్త్ సూపర్వైజర్, స్వామి హెల్త్ అసిస్టెంట్, R.రూప్ కుమార్, హెల్త్ అసిస్టెంట్, రాజేశ్వరి, లీలా, దేవి ఏఎన్ఎంలు, పి ప్రశాంతి రత్నం, MLHP, ఆశాలు అంగన్వాడి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *