Breaking News

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో అలరించిన అలంకృత శకటాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సోమవారం భారత స్వాతంత్ర దినోత్సవం రోజున జరిగిన 76 వ దినోత్సవ వేడుకల్లో ప్రధానంగా అలరించిన అలంకృత శకటాలు ఎంతగానో అలరించాయి. రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించి 15 అలంకృత శకటాలు వివిధ శాఖల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించాయి. కమిషనర్ తో పాటు జాయింట్ డైరెక్టర్లు టి.కస్తూరిబాయ్, కిరణ్ కుమార్ వారి సిబ్బంది పర్యవేక్షించారు. ఉత్తమ శకటాల ఎంపికకై విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, సమాచార శాఖ విశ్రాంత పిఆర్ఓ శీలం రమేష్, నగరపాలక సంస్థ విశ్రాంత డి.ఇ. జెట్టి రామకృష్ణ మోహనరావు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇక గ్రామ వార్డు సచివాలయం శకటం, మనబడి నాడు నేడు శకటం, గృహ నిర్మాణ శాఖ శకటం లకు వరుసగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు లభించగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయా శాఖల మంత్రులు ఉన్నతాధికారులకు అభినందిస్తూ అవార్డులు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *