విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పవిత్ర కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా విజయవాడ నగరంలోని భవనిపురం, రామవరప్పడు,మరియు తూర్పు నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లలోని సన్నిహితులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులచే ఘనంగా నిర్వహించిన వేడుకలకు తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ ముఖ్య అతిథిగా హాజరై ఆ కృష్ణ భగవానుడుకి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు అందుకొన్నారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు భూమి మీద అవతరించిన కృష్ణుని జీవితసారం ఆచారణీయం అని,ఆయన జీవిత పాఠాన్ని స్పూర్తిగా తీసుకొని మనమంతా కష్ట, నష్టాలను సవాలుగా తీసుకొని జీవితంలో ఎదగాలని అన్నారు.ఆ కృష్ణ భగవానుని ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని అవినాష్ ఆకాంక్షించారు. తదనంతరం నిర్వాహకులు ఏర్పాట్లు చేసిన అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించిన అవినాష్ భక్తులకు అన్నవితరణ చేశారు.ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్లు తాటిపర్తి కొండారెడ్డి, వియ్యపు అమర్నాధ్, పుప్పాల కుమారి,తంగిరాల రామిరెడ్డి,గాంధీ కో ఆపరటివ్ బ్యాంక్ డైరెక్టర్ జోగారాజు, రామవరప్పడు సర్పంచ్ వరి శ్రీదేవి,వైస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News