Breaking News

సెంట్రల్ నియోజకవర్గంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

శ్రీకృష్ణ నామస్మరణతో మారుమ్రోగిన వైష్టవాలయాలు
కృష్ణతత్వం ఆచరణీయం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
లోకానికి జ్ఞానాన్ని పంచిన గీతాచార్యుడు అయిన కృష్ణుని జన్మదినోత్సవం సర్వ మానవాళికి పర్వదినమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్టవాలయాలను దర్శించి స్వామి వారికి అభిషేకాలు, పంచామృతాలు, గీతా పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. వివిధ రకాల ఫలాలు, అటుకులు, వెన్న, పెరుగు, మీగడను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నికృష్ణులు, గోపిక‌ల వేష‌ధార‌ణ‌ ఆకట్టుకున్నాయి. ఆయా వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్మ స్వరూపమని.. దశావతారాలలో పరిపూర్ణమైనదని పేర్కొన్నారు. శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథినాడు ఆ మధుసూదనుడు జన్మించాడని మల్లాది విష్ణు తెలిపారు. ఆ గోకుల నందనుడు జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయమని వెల్లడించారు. శ్రీకృష్ణుడి జీవితం ఒక ధర్మశాస్త్రం అని.. సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపే విధంగా ఆ పరమాత్ముడు అర్జునునికి గీతను బోధించాడని పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని కృష్ణ జన్మాష్టమి పండుగ గుర్తుచేస్తుందన్నారు. కృష్ణతత్వం చదివిన వారికి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుందని.. గీతాసారాన్ని మనసున నింపుకోగలిగితే జీవితం సంతోషమయం అవుతుందని తెలియజేశారు.సకల దేవతా స్వరూపం గోమాత మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిద‌ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మన పూర్వీకులు గోవులను ఆస్తులుగా పరిగణించేవార‌ని, కట్నకానుకల రూపంలో కూడా గోవులనే ఇచ్చేవార‌ని తెలిపారు. రాజ్యాల ఆర్థికబలానికి గోవులు ఒక సూచికలా ఉండేవ‌ని.. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేమ‌ని చెప్పారు. కృష్ణుని రూపం పూజ‌లందుకునే ప్రతిచోటా వెనుకే గోమాత కూడా ఉంటుందన్నారు. నేటి ఆధునిక సమాజంలోనూ గృహప్రవేశాలు, ఆల‌య కుంభాభిషేకాలు, ఇతర శుభకార్యాలలో ముందుగా గోవును ప్రవేశ‌పెట్టే సంప్రదాయం న‌డుస్తోంద‌న్నారు. అటువంటి గోమాత సంరక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మార్గనిర్దేశకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందని మల్లాది విష్ణు వెల్లడించారు. మన సంస్కృతీ, సాంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో భాగంగా.. తన నివాస ప్రాంగణంలో సీఎం వైఎస్ జగన్ గోశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకుంటే గోదానం చేసిన ఫలితం వస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. శ్రీ కృష్ణ పరమాత్ముని కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం బృందావనంలో చిన్నికృష్ణుడు ఉట్టిని కొట్టిన విధానాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని పలుచోట్ల ఉట్టి మహోత్సవాలను నిర్వహించారు, పిల్లాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. లోకానికి జ్ఞానాన్ని పంచిన గీతాచార్యుడు అయిన శ్రీ కృష్ణుని జన్మదినోత్సవం సర్వ మానవాళికి పర్వదినమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. సెంట్రల్ నియోజకవర్గ వ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు శుక్రవారం వైభవోపేతంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు వైష్టవాలయాలను దర్శించి స్వామి వారికి అభిషేకాలు, పంచామృతాలు, గీతా పారాయణం, కుంకుమార్చనలు నిర్వహించారు. వివిధ రకాల ఫలాలు, అటుకులు, వెన్న, పెరుగు, మీగడను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నికృష్ణులు, గోపిక‌ల వేష‌ధార‌ణ‌ ఆకట్టుకున్నాయి. ఆయా వేడుకలలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొని స్వామి వారికి విశేష పూజలు నిర్వహించారు. మహావిష్ణువు ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణపరమాత్మ స్వరూపమని.. దశావతారాలలో పరిపూర్ణమైనదని పేర్కొన్నారు. శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథినాడు ఆ మధుసూదనుడు జన్మించాడని మల్లాది విష్ణు తెలిపారు. ఆ గోకుల నందనుడు జన్మదిన మహోత్సవాన్ని గోకులాష్టమిగా నిర్వహించడం హైందవ సంప్రదాయమని వెల్లడించారు. శ్రీకృష్ణుడి జీవితం ఒక ధర్మశాస్త్రం అని.. సమస్త మానవాళిని సన్మార్గంలో నడిపే విధంగా ఆ పరమాత్ముడు అర్జునునికి గీతను బోధించాడని పేర్కొన్నారు. భగవద్గీత ద్వారా శ్రీ కృష్ణుడు భోదించిన సందేశాన్ని కృష్ణ జన్మాష్టమి పండుగ గుర్తుచేస్తుందన్నారు. కృష్ణతత్వం చదివిన వారికి నిజమైన ప్రేమతత్వం తెలుస్తుందని.. గీతాసారాన్ని మనసున నింపుకోగలిగితే జీవితం సంతోషమయం అవుతుందని తెలియజేశారు.సకల దేవతా స్వరూపం గోమాత మానవజాతి మనుగడకు అనాదిగా గోమాత చేస్తున్న సేవ వెలకట్టలేనిద‌ని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. మన పూర్వీకులు గోవులను ఆస్తులుగా పరిగణించేవార‌ని, కట్నకానుకల రూపంలో కూడా గోవులనే ఇచ్చేవార‌ని తెలిపారు. రాజ్యాల ఆర్థికబలానికి గోవులు ఒక సూచికలా ఉండేవ‌ని.. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల నుంచి నేటి వరకు గోవు లేని సమాజాన్ని ఊహించలేమ‌ని చెప్పారు. కృష్ణుని రూపం పూజ‌లందుకునే ప్రతిచోటా వెనుకే గోమాత కూడా ఉంటుందన్నారు. నేటి ఆధునిక సమాజంలోనూ గృహప్రవేశాలు, ఆల‌య కుంభాభిషేకాలు, ఇతర శుభకార్యాలలో ముందుగా గోవును ప్రవేశ‌పెట్టే సంప్రదాయం న‌డుస్తోంద‌న్నారు. అటువంటి గోమాత సంరక్షణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మార్గనిర్దేశకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తోందని మల్లాది విష్ణు వెల్లడించారు. మన సంస్కృతీ, సాంప్రదాయాలను భావి తరాలకు అందించడంలో భాగంగా.. తన నివాస ప్రాంగణంలో సీఎం వైఎస్ జగన్ గోశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తిశ్రద్ధలతో కృష్ణాష్టమిని జరుపుకుంటే గోదానం చేసిన ఫలితం వస్తుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు పేర్కొన్నారు. శ్రీ కృష్ణ పరమాత్ముని కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలపైన, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపైన ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం బృందావనంలో చిన్నికృష్ణుడు ఉట్టిని కొట్టిన విధానాన్ని జ్ఞప్తికి తెచ్చుకొని పలుచోట్ల ఉట్టి మహోత్సవాలను నిర్వహించారు, పిల్లాపెద్దా తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొని సందడి చేశారు. శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాలలో వైసీపీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కోఆర్డినేటర్లు, భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *