Breaking News

 ఫోటో జర్నలిస్ట్‌ తీసిన ఫోటో జీవితంలో మార్పు తీసుకువస్తుంది…

ఒక క్లిక్‌.. ఎన్నో భావాలకు లాజిక్‌..
ప్రభుత్వ పథకాలపై ఫోటో జర్నలిస్టులకు జిల్లా స్థాయి పోటీలు నిర్వహిస్తాం…
జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఒక చాయచిత్రం వేయి పదాల అర్థాన్నిస్తుందని ఫోటో జర్నలిస్టు తీసిన ఫోటో ప్రచరించడం ద్వారా ఎన్నో జీవితాలలో మార్పు తీసుకువచ్చిన సంఘటనలు ఉన్నాయని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.ప్రపంచ ఫ్రోటోగ్రఫీ దినోత్సవ సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆయన కార్యాలయంలో వివిధ దినపత్రికలలో సేవలందిస్తున్న ఫోటో జర్నలిస్టులను సన్మానించారు.తొలుత ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్‌ ఓ.ఎం.డాగ్యూరే చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కేవలం ఒక్క ఫోటోతో ఎన్నో భావాలను బాహ్య ప్రపంచానికి తెలియజేసే అద్భుత శక్తి ఒక్క ఫోటోగ్రఫీకే ఉంటుందన్నారు. మానవ జీవితానికి ఫోటోగ్రఫీకి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఫోటోలు భద్రపరచడం అంటే చరిత్రను భద్రపరిచినట్లేనన్నారు. కాలగర్భంలో కలిసిపోయే ఎన్నో మధుర స్మృతులను పదిలంగా ఉంచగల శక్తి ఫోటోలకే ఉంటుందన్నారు. ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్‌ ఓ.ఎం.డాగ్యూరే 1837లో ఫోటోగ్రఫిని కనుగోనడం జరిగిందన్నారు. బాక్‌ అండ్‌ వైట్‌తో ప్రారంభమైన ఫోటోగ్రఫీ కాలానుగుణంగా కలర్‌ఫుల్‌గా మారి కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. మీడియాలో పనిచేసే ఫోటో జర్నలిస్టులు వారి ఆలోచన సరళికి పదునుపెట్టి ఓర్పు నేర్పుతో తీసిన ఫోటోలు పత్రికలో ప్రచురించడం ద్వారా ఎన్నో జీవితాలలో వెలుగులు నింపిన సంఘటనలు ఉన్నాయన్నారు. ఆ సమయంలో ఫోటో తీసిన ఫోటో జర్నలిస్టులలో కలిగే ఆనందం చెప్పనలవి కానిదన్నారు. ఒక మంచి ఫోటో తీసేందుకు ఎంతో సమయాన్ని వేచిచూడవలసి ఉంటుందన్నారు. పత్రికలలో ప్రచురించబడే వార్తలలో ఎంత మంచి వార్త అయిన ఫోటో లేనిదే పాఠకులను అంతగా ఆకర్షించదన్నారు. పాఠకులను ఆకర్షించడంలో ఫోటో జర్నలిస్టులదే ప్రధాన భూమిక అన్నారు. ఫోటో జర్నలిస్టులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించి ఉత్తమ చాయచిత్రాలు తీసిన ఫోటోజర్నలిస్టులకు ప్రశంసా పత్రం నగదు ప్రోత్సాహకాలను అందిస్తామన్నారు. ఫోటో జర్నలిస్టులు నైపుణ్యన్ని పెంపొందించుకునేందుకు ఫోటోగ్రఫి రంగంలో నిపుణులతో శిక్షణ అందించేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఫోటో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి యు. సురేంద్రనాద్‌, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్‌. వి. మోహన్‌రావు, ఎవి సూపర్‌వైజర్‌ ఎ. సాయిబాబా, పబ్లిసిటీ అసిస్టెంట్‌ వి. వి ప్రసాద్‌ సీనియర్‌ ఫోటో జర్నలిస్టులు సిహెచ్‌ విజయభాస్కర్‌, వైడి ఆనంద్‌, రూబెన్‌ బెసాలియల్‌, సిహెచ్‌ నారాయణరావు, కెవిఎస్‌గిరి, దుర్గాప్రసాద్‌, జివి నారాయణ, సిహెచ్‌వి మస్తాన్‌, వివిధ దినపత్రికలకు చెందిన ఫోటోజర్నలిస్టులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *