విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రకాశం పంతులు చిత్ర పట్టానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, పూలమాల వేసిన నివాళులర్పించారు. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు కృషి చేయడమే వారికి అర్పించే నిజమైన నివాళి అన్నారు. దేశభక్తి, త్యాగనిరతిని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. క్విట్ ఇండియా, సైమన్ కమిషన్ గో బ్యాక్, ఉప్పు సత్యాగ్రహం వంటి పోరాటాలలో ముందుండి నడిపించిన నాయకులు ఆంధ్రకేసరి, తెల్లవాడి తుపాకీ తూటాలకు భయపడని ధీశాలి అన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రజలకు ఎనలేని సేవ చేవలందించారన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ అదనపు కమిషనర్(జనరల్) యం.శ్యామల, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.పి.రత్నావళి, ఎస్.ఇ పి.వి.కె భాస్కర్, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Prajavartha Online Telugu News