విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం కోసం సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు,వేట లేని సమయంలో వారికి ఆర్థిక సహాయం చేస్తున్న ఘనత వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం క్రిష్ణలంక కరకట్ట ప్రాంతం లో ఇటీవల అకాల మరణం చెందిన విజయవాడ ఫిషర్ మెన్ కోపరటివ్ సొసైటీ అధ్యక్షులు మోపిదేవి నాగరాజు సంస్మరణ సభకు ముఖ్య అతిథి గా హాజరైన అవినాష్ వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం చివరి వరకు పోరాడిన మంచి మనిషి నాగరాజు అని, కొద్దిరోజుల ముందే ఆయన నన్ను కలిసి సొసైటీ లో 156 కుటుంబాలు ఉంటే గత 50 ఏళ్లుగా ప్రకాశం బ్యారేజీ ఎరువైపు ఘాట్ వద్ద కేవలం 15కుటుంబాల వారు మాత్రమే చేపలు పట్టుకొంటూ మిగతా సొసైటీ సభ్యులను అడ్డుకొంటున్నారని,సంబంధిత అధికారులతో మాట్లాడి అందరికి హక్కుగా వేటకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరడం జరిగిందని, కానీ ఇంతలోనే వారు మరణనించడం బాధాకరం అని అన్నారు.వారు భౌతికంగా నేడు మన మధ్య లేకపోయినా మీ అందరి కోసం ఆయన పడ్డ తపన,సమస్య పరిష్కారానికి ఆయన చేసిన కృషి మరువలేనిది అని,తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి మీ 156 కుటుంబాల సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని అవినాష్ హామీ ఇచ్చారు.స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు జిల్లా రాజకీయాలను ఏ విధంగా శాసించారో,పేదల సమస్యలు పట్ల ఏవిధంగా పోరాటం చేశారో అందరికి తెలుసు అని,ఒకసారి మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉంటామని,మీకు అండగా నిత్యం అందుబాటులో ఉంటామని మీకు ఏ చిన్న కష్టం వచ్చిన అర్ధరాత్రి అయిన సరే నేరుగా నాకే కాల్ చెయ్యొచ్చు అని అవినాష్ భరోసా ఇచ్చారు.
ఆర్థిక సహాయం అందజేత
ఇటీవల మరణించిన విజయవాడ ఫిషర్ మెన్ సొసైటీ అధ్యక్షుడు మోపిదేవి నాగరాజు కుటుంబానికి దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేసినట్టు ట్రస్ట్ చైర్మన్, తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం నాగరాజు సంస్మరణ సభలో పాల్గొన్న అవినాష్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి నగదును అందజేశారు. భవిష్యత్ లో ఏ సమస్య వచ్చిన వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, మత్యకార నాయకులు కొండా, నాగేశ్వరరావు, ప్రసాద్, ఆంజనేయులు, శ్రీను,మోహన్ రావు,వైస్సార్సీపీ నాయకులు సుబ్బరాజు,దుర్గారావు,రాజా,శుభాని,బాలరాజుఎన్. స్.రాజు,సుబ్బారెడ్డి,విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News