Breaking News

అనుమతి లేకుండా వాల్ రైటింగ్స్ రాసినా, పోస్టర్స్ అంటించినా భారీ మొత్తంలో అపరాధ రుసుం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ప్రభుత్వ భవనాలు, గోడలపై అనుమతి లేకుండా వాల్ రైటింగ్స్ రాసినా, పోస్టర్స్ అంటించినా భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించడంతో పాటు పోలీసు కేసులు కూడా నమోదు చేస్తామని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఐఏయస్  స్పష్టం చేశారు. శనివారం నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ భవనాల గోడలపై అనధికారికంగా వాల్ పెయింటింగ్ వేస్తున్న, వ్యర్ధాలను రోడ్ల మీద వేస్తున్న టిఫిన్ షాప్స్, ఫ్లెక్స్ షాప్స్ వారి నుండి కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రజారోగ్య అధికారులు రూ.35 వేలు అపరాధ రుసుం విధించి, సీజ్ చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిశుభ్రతకు నగరపాలక సంస్థ ప్రజారోగ్య కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని, కాని కొందరు రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్ధాలు వేస్తూ నగర అపరిశుభ్రతకు కారణమవుతున్నారని, అటువంటి వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శనివారం మణిపురం ఫ్లైఓవర్ కు అనుమతి లేకుండా తమ సంస్థ పెయింటింగ్ వేసుకున్న రాఘవేంద్ర టైల్స్ సంస్థకు రూ.10 వేలు అపరాధ రుసుం విధించి, వారితోనే వైట్ వాష్ పెయింట్ వేయించామన్నారు. అలాగే అరండల్ పేటలోని శిల్పా యాడ్స్ సంస్థ షాప్ ముందు వ్యర్ధాలను వేయడం గమనించి రూ.20 వేలు అపరాధ రుసుం విధించామని, విద్యా నగర్ 3 వ లైన్ లోని ఆనంద్ టిఫిన్ సెంటర్ కూడా వ్యర్ధాలు రోడ్ మీద వేసిన కారణంగా రూ.5 వేలు అపరాధ రుసుం విధించి, సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. నగరంలో వ్యర్ధాలు, చెత్త సేకరణకు పారిశుధ్య కార్మికులు ఇంటింటికి వస్తున్నారని, వ్యాపార సంస్థల నుండి చెత్త సేకరణకు కూడా ప్రత్యేకంగా కమర్షియల్ చెత్త సేకరణ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. ఇక నుండి రోడ్ల మీద, కాల్వల్లో వ్యర్దాలు వేసేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, ఇప్పటికే పారిశుధ్య పర్యవేక్షణకు నగరంలో 4 టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నగర పరిశుభ్రత ద్వారా స్వచ్చ గుంటూరు సాధనకు నగరపాలక సంస్థకు నగర ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు కలిసి రావాలని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *