Breaking News

గ్రామస్థాయిలో మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం!!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల్లో పండించిన పంటను స్థానికంగా విక్రయించేలా ఆర్బీకేల సమీపంలో మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటవుతాయిని, ఈ కేంద్రాల కోసం రైతు భరోసా కేంద్రాల సమీపంలో 50 సెంట్ల నుంచి ఎకరం స్థలాన్ని త్వరితగతిన సమీకరించాలని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న పిఎస్, డైరీ ఎండి అహ్మద్ బాబులు వివిధ జిల్లాల అధికారులకు ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం విజయవాడ నుంచి మల్టీపర్పస్ ఫెసిలిటీ సెంటర్, ఏఎంసీయు ,బిఎంసియు బిల్డింగ్ ల నిర్మాణం పురోగతి పై మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న పిఎస్, డైరీ ఎండి అహ్మద్ బాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్, డి ఆర్ ఓ తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని వీడియో కాన్ఫరెన్స్ హల్ నుంచి జిల్లా రెవిన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు , ల్యాండ్ సెక్షన్ తహసీల్దార్ రాధికా, తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు అధికారులతో ఆ ఇరువురు అధికారులు మాట్లాడుతూ, గ్రామ స్థాయిలో మార్కెటింగ్‌ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో పంటకోతకు ముందు, తర్వాత రైతులకు మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. దళారీల బెడద లేకుండా పంట ఉత్పత్తులను రైతులు నేరుగా కళ్లాల నుంచి విక్రయించుకునే అవకాశం ఇ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ద్వారా కల్పించనున్నారని వివరిస్తూ, దీనిద్వారా ప్రతి రైతును అఖిల భారత మార్కెట్‌కు అనుసంధానిస్తారు. గిట్టుబాటు ధర లభించే వరకు ఈ సెంటర్లలో నిల్వ చేసుకుని తమకు నచ్చినప్పుడు అమ్ముకోవచ్చని తెలిపారు. ఏ గ్రామంలో ఏ ఉత్పత్తులు పండిస్తున్నారు? సాగులో ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు? నాణ్యత ఎలా ఉంది? దిగుబడి ఎంత? తదితర అంశాలను ఈ ప్లాట్‌పామ్‌ ద్వారా వ్యాపారులు సైతం తెలుసుకోవచ్చన్నారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ఎం ఎస్ పి ధరలను వివరించే తాజా పోస్టర్లను అతికింపచేయాలని సూచించారు. ఆ విధంగా ఏర్పాటుచేస్తున్నారో లేదో అధికారులు తనిఖీ చేయాలన్నారు.
పాడి రైతుకు అన్ని విధాలుగా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న పాలవెల్లువ పథకంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని డైరీ ఎండి అహ్మద్ బాబు ఆదేశించారు. ప్రభుత్వ డైయిరీకి పాలు వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని సూచించారు. పాల సేకరణ కేంద్రాల వారీగా పాలఉత్పత్తి ఏ విధంగా జరుగుతున్నదన్న అంశంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ డైయిరీ వల్ల వచ్చే ఆదాయం గురించి రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *