Breaking News

కుల, మత, పార్టీలకతీతంగా నవరత్నాలు… : మంత్రి జోగి రమేష్

పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుల, మత, పార్టీలకతీతంగా నవరత్నాలు అందిస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గురువారం సాయంత్రం పెడన నియోజకవర్గం, పెడన పురపాలక పరిధిలో 18 వార్డు, 7వ సచివాలయం పరిధిలోని గృహాలను మంత్రి జోగి రమేష్ సందర్శించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల వివరాలను లబ్ధిదారులకు తెలియజేస్తూ, ఇప్పటివరకు అందిన పథకాల తాలూకా నగదు వివరాలను వారికి మంత్రి తెలియజేశారు. లబ్ధిదారులను మంత్రి ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం నుంచి ఆయా పథకాల ద్వారా వారు పొందిన లబ్ధిని వివరిస్తూ ముందుకు సాగారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అందిస్తూ రాష్ట్ర ప్రజల అవసరాలను తీరుస్తున్నారాన్నారు. పేద పిల్లల చదువు కోసం అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, విద్యావసతి వంటి పథకాలను రూపొందించి చదువుల ఖర్చు భారాన్ని తగ్గించారన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని తమ బంగారు భవిష్యత్తును ఏర్పరచుకోవాలన్నారు. అర్హులైన మహిళలకు ఆసరా, చేయూత ఇవ్వడంతో పాటు నెలలో మొదటి రోజునే టంచన్ గా వివిధ రకాల పింఛన్లను మీ గడప వద్దకే వాలంటీర్ల ద్వారా జగన్ అందిస్తున్నారన్నారు. ఇళ్ళు లేనివారికి స్థలాలిచ్చి నిర్మాణాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారన్నారు. ఇటువంటి మంచి పనులు చేస్తున్న మన ముఖ్యమంత్రిని మీ మనసుల్లో దీవించాలని మంత్రి కోరారు. కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగ, త్వరలోనే డ్రైనేజీ, రోడ్ల నిర్మాణం, రైల్వే గేట్ కు సమీపంలో ఉన్న కాలువకు ర్యాంపు, గోడ నిర్మిస్తామని ఆయన వారికి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పెడన మునిసిపల్ ఛైర్మెన్ బళ్ళా జ్ఞాన లింగ జ్యోత్స్నా రాణి, వైస్ ఛైర్మెన్లు ఎం.డి. ఖాజా, బైలపాటి జ్యోతి, పెడన మున్సిపల్ కమిషనర్ ఎం.అంజయ్య, పెడన తాసిల్డారు పి.మధుసూధనరావు, 18 వ వార్డు కౌన్సిలర్ సుమప్రియ, 3 వ వార్డు కౌన్సిలర్ బళ్ళా గంగయ్య, పెడన మునిసిపాలిటీ ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కటకం నాగకుమారి , వైస్సార్ సీపీ పెడన పట్టణ అధ్యక్షులు బండారు మల్లిఖార్జునరావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *