-మంత్రి ఆర్కే రోజా నేతృత్త్వంలో వైయస్సార్ సిపి ఆస్ర్టేలియా సమావేశంలో మహానేతకు ఘన నివాళి
-ఆస్టేలియా బ్రిస్బేన్ నగరంలో హోరెత్తిన జోహార్ వైయస్సార్ – జై జగన్ అంటూ నినాదాలు
-ఆస్ర్టేలియాలో మంత్రి ఆర్.కే. రోజా మాట్లాడిన పాయింట్స్
-వైయస్సార్ ఒక లెజెండ్
-రాజకీయానికి రాజసం నేర్పిన మహానేత, రాజనీతికి విశ్వసనీయతను నేర్పిన ప్రజానేత
ఆస్ట్రేలియా, నేటి పత్రిక ప్రజావార్త :
దేవుడి పరిపాలన అంటే రాముడి పరిపాలన… రాజన్న పరిపాలన ఒక్కటే. హిందూ, ముస్లీం, క్రీస్టియన్, పేద ప్రజలందరూ బగవంతుండిని ప్రార్ధిస్తే, వాళ్ళు రాలేక….వాళ్ళ ప్రతినిధిగా రాజశేఖర్ రెడ్డిగారిని పంపించారనడమంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. విద్య, వైద్యాన్ని ప్రజలకు చేరువచేసి, రైతులకు, ప్రజలందరికి సంక్షేమాన్ని అందించిన మహానేత వైయస్సార్. ఆయన సంక్షేమంతో అందరి గుండేల్లో నిలిచిపోయారు. మహానేత చనిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఆయన పేరు తలుచుకుంటే మన కళ్ళు చెమర్చుతాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో రకంగా ఆయన అందించిన సంక్షేమం, సహాయం పొందినవారే. వైయస్సార్ అంటే పేరు కాదు బ్రాండ్. అభివృద్ది, సంక్షేమం తన రెండు కళ్ళు అని రాజశేఖర్ రెడ్డి ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. సెప్టెంబర్ 2, 2009 వరకు అభివృద్ది, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తూ… ప్రజల కోసం వెళ్ళి, తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు. భారతదేశ రాజకీయాల్లోనే విషాదకరమైన రోజు. 10 కోట్లమంది ప్రజలు గుండెలు బరువయ్యాయి. మరెన్నో గుండెలు పగిలిపోయాయి. ఆ గుండెలకు భరోసా ఇస్తూ.. నేనున్నా అంటూ.. రాజన్న బిడ్డ , రాజన్న రక్తం.. వైయస్ జగన్మోహన్ రెడ్డి మన కోసం రావడం మనందరికీ తెలుసిందే. మహానేత వైయస్సార్ చనిపోయిన తర్వాత ఆయన కుటుంబాన్ని నడిరోడ్డుమీద నిలబెట్టాలని సోనియాగాంధీ చేసిన కుట్రలు మనందరికీ విధితమే. ఆ కుటుంబం నుండి వచ్చిన వై.యస్ జగన్మోహన్ రెడ్డి అదే తెలుగు గడ్డమీద మూడు రంగుల జెండాను ఎగురవేశారు. రాజన్న పాలన ఎంటో మళ్ళీ చూపించడం మనందరం గర్వించాల్సిన విషయం.
మహానేత రాజశేఖర్ రెడ్డి ఏదైతే కలలు కన్నారో దాని కోసం జగన్మోహన్ రెడ్డి ఎన్నో అవమానాలు, కష్టాలను అనుభవించి, చివరికి జైలుకి వెళ్ళి వచ్చినా కూడా తన తండ్రి పేరుని నిలబెట్టారు. ఈ మూడు సంవత్సరాల పాలనకు నిదర్శనమే ఈ రోజు దేశంలో ఏ సర్వే జరిగినా కూడా బెస్ట్ సి.ఎం. అని దేశం మంతా చెప్పుకుంటున్నారు. దేవుడి పరిపాలన అంటే ….రాముడి పరిపాలన…రాజన్న పరిపాలన అనే విధంగా ప్రజల మనస్సులో ముద్రవేసిన మహానేత వైయస్సార్. ఆయన కొడుకుగా, సంక్షేమ వారసత్వాన్ని పొందుకున్న జగనన్నకు మనందరం సపోర్టు చేస్తూ… రాబోయే ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలుపించుకోవల్సిన బాధ్యత మనందరిపైన వుంది. అదే మనం మహానేత రాజశేఖర్ రెడ్డి కి ఇచ్చే ఘనమైన నివాళి.
Prajavartha Online Telugu News