Breaking News

లబ్ధిదారుల కోసం స్థల పరిశీలన…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లో బాగా భాగంగా కోరుకొండ మండలం గాదరాడ లో 447 మంది లబ్ధిదారుల కోసం స్థల పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం గాదరాడ గ్రామంలో ఎం పి ఐ లేఔట్ల కోసం స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తో కలిసి కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధావీలత మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక పేదవానికి సొంత ఇంటి కల సహకారం చేసేందుకు భూ సేకరణ చేపట్టడం జరుగుతుందన్నారు . ఇందులో భాగంగా కొవ్వూరు మండలం గాదరాడ గ్రామంలో 447 మంది లబ్దిదారుల కోసం సుమారు రెండు చోట్ల సుమారు 12 ఎకరాలు స్థలాన్ని భూ సేకరణ కోసం క్షేత్రస్థాయిలో స్థానిక ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ, తదితర శాఖల అధికారులతో కలిసి క్షేత్ర స్థాయి లో పర్యటించామన్నారు. కలెక్టర్ వెంట రాజానగరం శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తహశీల్దార్ పి. పాపారావు, మండల సర్వేయర్ పి.రామకృష్ణ, వి ఆర్ వో నారాయణ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *