Breaking News

ఆకస్మికంగా సచివాలయాల తనిఖీ…

-ప్రజలకు దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించండి..
-సచివాలయానికి వచ్చే ఆర్జీలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపండి..
-రక్తహీనత పై ప్రత్యేక దృష్టి పెట్టండి..
-జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి..
-గ్రామ సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ప్రజలకు దగ్గరగా ఉంటూ మెరుగైన సేవలు అందించడంతో పాటు సచివాలయానికి వచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సచివాలయ ఉద్యోగులకు సూచించారు.
దుర్గాపురం 199, గులాబీ తోట 200వార్డు సచివాలయాలను బుధవారం జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూమెంట్‌ రిజిస్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌ మనం గుర్తు పెట్టుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్‌ లైన్‌ నెంబర్లు, వైఎస్‌ఆర్‌ పింఛన్‌కానుక, జగనన్న అమ్మఒడి, రైతుభరోసా వివిధ పథకాల అర్హుల అనర్హుల జాబితాను ఎస్‌ఎల్‌ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. నవరత్నాలు పేదలందరికి ఇళ్లు పథకంలో ఇంటి పట్టాలకు సంబంధించి ఇంకనూ ప్రారంభం కాని, బిలో బేస్మెంట్‌ స్థాయిలో ఉన్న ఇళ్లను వెంటనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. వార్డు సచివాలయం పరిధిలో ఎంత మంది గర్భిణీలు ఉన్నారు. ఎంత మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. మాతృమరణాలు ఏమైనా జరిగాయా వంటి వివరాలను ఏఎస్‌ఎంను అడిగి తెలుసుకొని గర్భిణి స్త్రీలలో రక్తహీనతను దూరం చేయడానికి పోషకాహారమైన భోజనం తీసుకునేలా మరింత అవగాహన కల్పించాలన్నారు. జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజన పథకం పాఠశాలలో ఎలా అమలు అవుతుంది సమాయానికి భోజనం అందిస్తున్నారా వంటి వివరాలను వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ను జిల్లా కలెక్టర్‌ అడిగి తెలుసుకుని పాఠశాలలను తనిఖీలు చేస్తూ మధ్యాహ్నం భోజనం సక్రమంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా సమయ వేళలు పాటించాలని ఆదేశించారు.అలాగే సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులకు నిర్ణీత సమయంలోగా పరిష్కారం చూపాలన్నారు. సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సేవలను సకాలంలో అందించాలని కలెక్టర్‌ డిల్లీరావు సచివాలయ సిబ్బందిని కోరారు.
జిల్లా కలెక్టర్‌ వెంట నార్త్‌ తహాశీల్థార్‌ దుర్గాప్రసాద్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *