Breaking News

మండలం లో ప్రాధాన్యతా భవన నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టరు…

-నాడు – నేడు పనుల పురోగతి సందర్బంగా విద్యార్థులతో కలెక్టరు ముఖాముఖి ..
-కలెక్టరు డా. కె. మాధవీలత

ఉండ్రాజవరం, నేటి పత్రిక ప్రజా వార్త :
ప్రజలకు మరింత మెరుగైన పౌరసేవలు అందించేందుకు అధికారుల చుట్టూ తిరిగే ఇబ్బందులు లేకుండా గ్రామ సచివాలయ వ్యవస్థను పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు. బుధవారం ఉండ్రాజవరం మండలం ఉండ్రాజవరంలో ఆర్భీకే, గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం, సత్యవాడలో మనబడి నాడు-నేడు రెండవ దశ పనులను కలెక్టరు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు మాధవీలత మాట్లాడుతూ గ్రామాల్లో ఆర్బీకే, సచివాలయాలు, వెల్ నెస్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజల ముంగిటికే పరిపాలనా వ్యవస్థను ముఖ్యమంత్రి తీసుకురావడం జరిగిందన్నారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండేందుకు అనుగుణంగా ఈ మూడు ప్రాధాన్యతా భవనాల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందన్నారు. అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా నియమించామన్నారు. జిల్లాలో 1100 ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలుచేపట్టాల్సి ఉండగా ఇప్పటికే 50శాతం పైగా భవన నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. మరో 150 భవనాలు పూర్తి కావడానికి సిద్దంగా ఉన్నాయని, మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయని కలెక్టరు తెలిపారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. లబ్దిదారులు త్వరత గతిని ఇళ్ల నిర్మాణాలుచేపట్టాలన్నారు. ఇందుకు అవసరమైన సిమ్మెంట్ , ఇసుక, ఐరన్ తదితర మౌలిక సదుపాయాలను కాలనీల వద్దే సమకూర్చడం జరుగుతుందన్నారు. ఇళ్ళ నిర్మాణాలు ప్రారంభిస్తే తదుపరి ప్రభుత్వం అన్నివిదాల సహాయ సహకారాలు అందిస్తుందని కలెక్టరు అన్నారు. లేఅవుట్ల లో ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తే 50 శాతం ఇళ్లు ప్రారంభమైన లేఅవుట్ల లో ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు, మీటర్లను ప్రభుత్వమే సమకూర్చుతుందని కలెక్టరు మాధవీలత తెలిపారు. ఇటువంటి సదావకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులకు అందింస్తున్న వివిధ పథకాల వివరాలను తెలుసుకున్నారు. అర్హులకు ప్రభుత్వం పథకాల ప్రయోజనాలు అందించడంలోను, అనర్హులను తొలగించే సమయంలో ప్రజలకు వివరాలు తెలపడంలోను సచివాలయసిబ్బంది చురుగ్గా వ్యవహరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభత్వ పథకాల ప్రయోజనాలను అందించాలన్నదే ప్రభత్వ లక్ష్యం అన్నారు. ఈ సందర్బం ఆర్బీకేను సందర్శించి అక్కడ రైతులకు అందిస్తున్నసేవలపై రైతులతో మాట్లాడారు.

విద్యార్థులతో కలెక్టరు మాధవీలత…
అనంతరం సత్యవాడ గ్రామంలో ఇందుకూరి సుబ్బరాజు జిల్లా పరిషత్ ఉన్నతపాఠశాల లో జరుగుతున్న మనబడి నాడు-నేడు 2 వ దశ పనులను కలెక్టరు పరిశీలించారు. విద్యార్థులతో పాఠ్యంశాలపై కలెక్టరు వారి ప్రతిభను పరిక్షించగా కంప్యూటరు ద్వారా వారు రూపొందించిన ప్రాజెక్టు వివరాలను కలెక్టరుకు తెలిపారు. నైపుణ్యం పెంచుకోవాడం ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోగలుగుతామని కలెక్టరు విద్యార్థులకు తెలిపారు. ప్రభుత్వం విద్యకు అంత్యం ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు పాఠ్యపుస్తకాలు కంప్యూటర్లు, పాఠశాలను ఆధునీకరిస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తుందన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *