Breaking News

జిల్లా అభివృద్ధికి చేయూత అందించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
ఖాతాదారుల ఆధారాభిమానాలు పొందుతున్న బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారులకు విరివిగా రుణాలు అందించి జిల్లా అభివృద్ధికి చేయూత అందించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 117వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బధవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధి జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, గౌరవ అతిధిగా పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని బాలశౌరి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ 1906లో ప్రారంభించబడిన బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అనాతికాలంలోనే దినదినాభివృద్ధి చెంది 180కు పైగా బ్యాంక్‌ బ్యాంచ్‌లను కలిగి ఉండడం గొప్ప విషయమన్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారులకు రుణాల మంజూరులో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నుండి జిల్లా యంత్రాంగానికి ఎటువంటి పిర్యాధులు రాలేదన్నారు. బ్యాంక్‌ ఖాతాదారులకు సేవలందించడంతో పాటు స్వచ్ఛంద సంస్థలు, సిఎస్‌ఆర్‌ యాక్టివిటీస్‌ అందించడం అభినందనీయమన్నారు. స్వయం సహాయ సంఘాలకు గృహా నిర్మాణాల లబ్దిదారులకు, వ్యవసాయ, విద్య రుణాలు అందించి జిల్లా యంత్రాంగానికి సహాకరించాలని కోరారు. బ్యాంకునకు తమ పూర్తి సహకారం ఎల్లపుడు ఉంటుందని కలెక్టర్‌ డిల్లీరావు హామి ఇచ్చారు.
పార్లమెంట్‌ సభ్యులు వల్లభనేని బాల శౌరి మాట్లాడుతూ 1969 సంవత్సరంలో ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసి గర్తుంపు పొందారన్నారు. తాను కూడా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాదారుడునని తన వ్యాపార లావాదేవీలు అన్ని ఈ బ్యాంకు నుండే నిర్వహించుకుంటున్నారన్నారు. నిరుద్యోగులకు ముఖ్యంగా డాక్టర్లు, ఇంజనీర్లు రుణాలను అందించాలని కోరారు. వ్యవసాయదారులకు, నిరుద్యోగులకు, మత్స్య కారులకు, చేనేత కార్మికులకు, ముద్ర రుణాలు, పియంఏవై వంటి రుణాలను అందించాలన్నారు. మన దేశంలో ప్రతిభకు కొదవ లేదని ప్రపంచ దేశాలలలో మన విద్యార్థులు ప్రముఖ కంపెనీలకు సిఇవోలు గా వ్యవహరిస్తున్నారని పార్లమెంట్‌ సభ్యులు బాల శౌరి అన్నారు. కార్యాక్రమంలో 117 కోట్ల రూపాలయ రుణాలను లబ్దిదారులకు మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా జోనల్‌ మేనేజర్‌ వివి సోమశేఖర్‌ డిప్యూటీ జోనల్‌ మేనేజర్‌ డి రామప్రసాదరావు, ఖాతాదారులు, బ్యాంకు అధికారులు, సిబ్బంది, రిటైడ్‌ ఉద్యోగస్తులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *