-నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రాజీవ్ గాంధీ పార్కు నందలి అభివృద్ధి పనుల యొక్క పురోగతిని నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ సంబందిత అధికారులతో కలసి పర్యవేక్షించి చేపట్టిన అన్ని పనులు వేగవంతముగా పూర్తి చేయాలని ఆదేశించారు. పార్క్ ఆవరణలో చేపట్టిన సివిల్ మరియు గ్రీనరి అభివృద్ధి వర్క్ పనులను పరిశీలిస్తూ, ఎంట్రన్స్ గేటు ఎదురుగా వున్న కల్వర్ట్ కి ప్రతి 10 అడుగులకి ఒక మాన్ హోల్ ఏర్పాటు చేయాలి, ఎంట్రన్స్ గేటు పక్కన ప్లాంట్స్ బాక్స్లు నిర్మించి అందులో మొక్కలను ఏర్పాటు చేయాలి, పార్కుకి తూర్పు వైపు ఉన్న కాంపౌండ్ వాల్ కి గేట్ ను ఏర్పాటు చేయాలి, స్కేటింగ్ ట్రాక్ రిపేర్ వర్క్స్ వెంటనే పూర్తి చేయాలి అన్నారు.
మ్యూజికల్ ఫౌంటైన్ చుట్టూ పంచదద్వ సర్కులర్ ట్రాక్ ఏర్పాటు చేసి, పంచదద్వ సర్కులర్ ట్రాక్ గురించి పబ్లిక్ తెలుసుకొనుటకు గాను డిస్ప్లే బోర్డు ఏర్పాటు చేయాలి, మ్యూజికల్ ఫౌంటైన్ రిపేర్ వర్క్స్ వెంటనే పూర్తి చేయాలి అన్నారు.
బయో డివేర్సిటీ (జీవవైవిధ్యం) హాల్ పక్కన వున్న స్క్రాప్ ను వెంటనే తీసివేయాలి, బయో డివేర్సిటీ (జీవవైవిధ్యం) హాల్ ముందు కేర్బ్ వాల్ ను నిర్మించాలి, ప్రకాష్ ఆర్ట్ వారి టాయిలెట్స్ వెంటనే రిపేర్ కంప్లీట్ చేసి వినియోగంలోకి తీసుకురావాలి, ప్రారంభోత్సవ శిలాఫలకం పైలాన్ లాగా అందరిని ఆకర్షించే విధంగా ఉండేలాగా నిర్మించాలి అన్నారు. పార్క్ ఆవరణలో ఇంపుగా పెరిగిన మొక్కలను ట్రిమ్మింగ్ చేయుట, పిచ్చి మొక్కలు తొలగించుట మరియు పాడైన మొక్కలు స్థానములో కొత్త మొక్కలు ఏర్పాటు చేసి పార్క్ ను సుందరంగా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అన్నారు.
పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News