Breaking News

సంక్షేమంతో సమానంగా అభివృద్ధి : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-నగర మేయర్ తో కలిసి రూ. 1.76 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వానికి రెండు కళ్ళు లాంటివని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదిశగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. 60వ డివిజన్ వాంబే కాలనీ సి-బ్లాక్ లో రూ.1.56 కోట్లతో బీటీ రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణతో పాటు 61 వ డివిజన్ ప్రగతీ నగర్ లో రూ.20 లక్షల నిధులతో సీసీ రోడ్లు, డ్రెయిన్ నిర్మాణానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో అభివృద్ధి శిలాఫలకాలకే పరిమితమైందన్నారు. కానీ సీఎం వైఎస్ జగన్ పాలనలో నగరం అభివృద్ధిలో కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. కేవలం రహదారుల నిర్మాణానికే నియోజకవర్గంలో దాదాపు రూ.100 కోట్ల నిధులు ఖర్చు చేసినట్లు వివరించారు. అలాగే ప్రతి డివిజన్ ను ఒక యూనిట్ గా చేసుకుని.. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. 60వ డివిజన్ లో గడిచిన మూడేళ్లలో రూ.11.36 కోట్లు., 61 డివిజన్ లో రూ. 9.57 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రధానంగా 60 వ డివిజన్ B బ్లాక్, 61వ డివిజన్ H బ్లాక్ ల నందు రెండు నూతన వార్డు సచివాలయాల భవన నిర్మాణాలను ఒక్కొక్కటి రూ. 70 లక్షల వ్యయంతో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. గాళ్ల వెంకయ్య కాలనీ, ఎలక్ట్రిసిటీ కాలనీలలో రూ. 17.57 లక్షల నిధులతో రోడ్లు, యూజీడీ పనులకు ఇటీవల భూమిపూజ నిర్వహించుకున్నామన్నారు. E, F & G బ్లాక్ ల నందు త్రాగునీటి సమస్య పరిష్కారానికి రూ. 26.36 లక్షల వ్యయంతో పవర్ బోర్లను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు. వాంబే కాలనీలో ఎలక్ట్రికల్ క్రిమిటోరియం ఈ ప్రభుత్వంలోనే రావడం జరిగిందని మల్లాది విష్ణు తెలిపారు. మరోవైపు వాంబేకాలనీ సహా అయోధ్యనగర్, దేవీనగర్, ఇందిరానాయక్ నగర్ లలో ఒక్కొక్కటి రూ. 80 లక్షల వ్యయంతో చేపట్టిన 4 హెల్త్ సెంటర్ల నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయని వివరించారు. అలాగే ఈ ప్రాంతంలో రూ. 2.50 కోట్ల నిధులతో నూతన బస్టాండ్ ను నిర్మించబోతున్నట్లు మల్లాది విష్ణు చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రభుత్వం దృష్టికి వచ్చిన ప్రతిఒక్క సమస్యను పరిష్కరిస్తూ.. 21 డివిజన్ల సమగ్రాభివృద్ధికి జగనన్న ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నిర్ణీత కాలవ్యవధిలోగా పనులన్నింటినీ పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో నగరం పూర్తిగా కళ తప్పిందన్నారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న‌గ‌ర‌ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం కోసం రూ. వందల కోట్ల నిధులను ఖ‌ర్చు చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి దక్షతకు అద్దం పడుతుందని రాయన భాగ్యలక్ష్మి అన్నారు. కార్యక్రమంలో ఈఈ(ఇంజనీరింగ్) శ్రీనివాస్, డీఈ(వాటర్ & యూజీడీ) రామకృష్ణ, ఏఈలు మౌసమి, అరుణ్ కుమార్, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, నాయకులు బెవర నారాయణ, బత్తుల దుర్గారావు, ఆర్.ఎస్.నాయుడు, సుభానీ, బాబు, దుర్గాప్రసాద్, నాని, ఇస్మాయిల్, వీఎంసీ సిబ్బంది, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *