Breaking News

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడి ఎమ్మెల్యే మల్లాది విష్ణు తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. కుందావారి కండ్రికలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగించుకుని వస్తున్న ఆయన.. మార్గమధ్యంలో ఆటో ప్రమాదాన్ని గమనించి వెంటనే కారు నిలిపివేశారు. తలకు బలమైన గాయమైన డ్రైవర్ ను తానే స్వయంగా ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తో ఫోన్‌ లో మాట్లాడి క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించిన తీరుపట్ల స్థానికులు ప్రశంసలు కురిపించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *