విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని కాపాడి ఎమ్మెల్యే మల్లాది విష్ణు తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. కుందావారి కండ్రికలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ముగించుకుని వస్తున్న ఆయన.. మార్గమధ్యంలో ఆటో ప్రమాదాన్ని గమనించి వెంటనే కారు నిలిపివేశారు. తలకు బలమైన గాయమైన డ్రైవర్ ను తానే స్వయంగా ఎస్కార్ట్ వాహనంలో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ తో ఫోన్ లో మాట్లాడి క్షతగాత్రునికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పందించిన తీరుపట్ల స్థానికులు ప్రశంసలు కురిపించారు.
Prajavartha Online Telugu News