-సిసిఎల్ఎ అధికారులతో జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజా వార్త :
జిల్లాలో సమగ్ర భూ రీసర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయని వీటిలో 13 గ్రామాలలో 13 వ నోటిఫికేషన్ పూర్తీ చేశామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సిసిఎల్ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ కు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్షా పథకం పనుల్లో భూ రికార్డుల స్వఛ్చికరణ సమగ్ర భూముల రీసర్వే ప్రక్రియ తదితర అంశాలపై సిసిఎల్ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ గురువారం జిల్లా కలెక్టర్ లు, జాయింట్ కలెక్టర్ లు సర్వే అధికారులతో ఆయన ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాలో జరుగుతున్న రీసర్వే ప్రక్రియ ప్రగతిని నగరంలోని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి కలెక్టర్ ఢిల్లీరావు సిసిఎల్ఎ కు వివరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 8 మండలాల్లోని 136 గ్రామాలలో భూ సర్వే నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో చివరి విడత అయిన 13 వ నోటిఫికేషన్ తో 13 గ్రామాలలో పూర్తి చేశామని అన్నారు.
జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్ పేట, కంచికచర్ల మండలం పరిటాల, ఎ కొండూరు మండలం వామకుంట్ల గ్రామం , తిరువూరు మండలం లో మారేపల్లి, ఆంజనేయపురం, ముష్టికుంట్ల, చిట్యాల గ్రామాలు, విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామం, గంపలగూడెం మండలం లో గంపలగూడెం , రాజవరం, చెన్నవరం , అనుమోలంక, కనుమూరు గ్రామాలలో , 13 వ నోటిఫికేషన్ పూర్తి చేశామని, గంపల గూడెం మండలం వినగడప గ్రామంలో గ్రౌండ్ వాలిడేషన్ తుది దశలో ఉందని 13 వ నోటిఫికేషన్ కు సిద్ధం చేస్తున్నామని కలెక్టర్ ఢిల్లీరావు వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ నుపూర్ అజయ్, జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఆఫీసర్ కె.సూర్య రావు ఉన్నారు.
Prajavartha Online Telugu News