గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రపత్రిక జర్నలిస్టుగా… అదే సమయంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ప్రప్రథమ అధ్యక్ష స్థాయి నుంచి… సత్తెనపల్లి నుంచి వరుసగా నాలుగు దఫాలు శాసనసభకు ఎన్నికైన దివంగత వావిలాల గోపాలకృష్ణయ్య 117 వ జయంతి వేడుకలు సత్తెనపల్లి వావిలాల ఘాటు లో ఎంతో ఘనంగా జరిగాయి. ఇదే రోజు వావిలాల చిత్రపటాన్ని క్షణాల్లో గీసిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ చిత్రకారుడు జింకా రామారావు ని అతిథులు ప్రశంసించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర మధ్య విమోచన కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి, శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యరావు, యూనియన్ పూర్వ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ఐజేయూ సభ్యులు ఎం లింగారెడ్డి, చలంచర్ల సాంబశివరావు ,శ్రీ వావిలాల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News