Breaking News

సత్తెనపల్లి లో ఘనంగా శ్రీ వావిలాల 117 వ జయంతి వేడుకలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రపత్రిక జర్నలిస్టుగా… అదే సమయంలో ఏపీయూడబ్ల్యూజే గుంటూరు జిల్లా ప్రప్రథమ అధ్యక్ష స్థాయి నుంచి… సత్తెనపల్లి నుంచి వరుసగా నాలుగు దఫాలు శాసనసభకు ఎన్నికైన దివంగత  వావిలాల గోపాలకృష్ణయ్య 117 వ జయంతి వేడుకలు సత్తెనపల్లి వావిలాల ఘాటు లో ఎంతో ఘనంగా జరిగాయి. ఇదే రోజు  వావిలాల చిత్రపటాన్ని క్షణాల్లో గీసిన సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ చిత్రకారుడు జింకా రామారావు ని అతిథులు ప్రశంసించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, రాష్ట్ర మధ్య విమోచన కమిటీ చైర్మన్ వి లక్ష్మణ రెడ్డి, శాసనమండలి ప్రభుత్వ విప్ డొక్కా మాణిక్యరావు, యూనియన్ పూర్వ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, ఐజేయూ సభ్యులు ఎం లింగారెడ్డి, చలంచర్ల సాంబశివరావు ,శ్రీ వావిలాల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *