విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రిని ఉద్దేశించి గవర్నర్ హరిచందన్ లేఖ రాస్తూ, “ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు, నేను మీ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 75వ స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకుని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకుంటున్న శుభ తరుణంలో దేశం అన్ని కీలక రంగాలలో మరింత ఉన్నత శిఖరాల వైపుకు ముందుకు సాగుతోంది. స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 28 అడుగుల భారీ విగ్రహాన్ని మీరు ప్రారంభించటం యావత్ జాతికి గర్వకారణం. బానిసత్వ చిహ్నాన్ని తొలగిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం, నాటి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం దేశవ్యాప్తంగా ప్రజల హృదయాలలో జాతీయవాద స్ఫూర్తిని రగిలించింది. మీకు ఫలవంతమైన దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, ఆనందం అందించాలని, జాతిని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు జగన్నాథ్, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు లభించాలని ప్రార్థిస్తున్నాను.” అని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News