Breaking News

ఉపాధ్యాయులు సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి పాలాభిషేకం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలప ట్ల ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం సానుకూల దృక్పథంలో ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ టీ.కల్పలత చెప్పారు.  పలు ఉపాధ్యాయులతో కలసి శనివారం ఆమె విజయవాడ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీ.కల్పలత  మాట్లాడుతూ రాష్ట్రంలో 40 ఏళ్ల జిల్లా పరిషత్ ఉపాధ్యాయలు ఎదురుచూసిన 692 మండల విద్యాశాఖ అధికారులు పోస్టుల (ఎంఈవోలను) కలను ఒకేసారి సాకారంచేస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కొనియాడారు. విద్యాశాఖ చరిత్రలో మరుపురాని రోజు అని, ఎన్నో సంవత్సరాల నుండి వేల మంది ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్న కల నిజమైందని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కి, విద్యాశాఖకు ధన్యవాదాలు తెలిపారు. మిగతా ఉపాధ్యాయలకు న్యాయ పరంగా  ఏమిచెందాలో అది వారికి చెందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉపాధ్యాయ సంఘాల నేతలు శ్రీనివాస్‌, పీ.వెంకటేశ్వరరావు, ఇప్పల వెంకటరెడ్డి, గిరిప్రసాద్‌రెడ్ది, కె.రాజశేఖర్‌, రమేష్‌బాబు, ఇంతియాజ్‌, సాయిరాం, సీతారాంరెడ్డి, వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *