విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర బీసీ మరియు సాధికారిక కమిటీ ప్రమాణ స్వీకారం ఈనెల 21వ తేదీన బుధవారం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు కాకు మల్లికార్జున యాదవ్ అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం తెలుగుదేశం పార్టీ బి.సి లోగో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాకు మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ 21వ తేదీన ఎన్టీఆర్ జిల్లాలోని బీసీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కింజరపు అచ్చంనాయుడు, రాష్ట్ర బీసీ సాధికారిక కమిటీ అధ్యక్షులు కొల్లు రవీంద్ర, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఇన్చార్జులు, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొంటారన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం అవలంభిస్తున్న బీసీ వ్యతిరేక విధానాలపై గళమెత్తలని, బీసీల సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బి.సి నాయకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్,రాష్ట్ర బి.సి.సెల్ ఉపాధ్యక్షులు దివి ఉమామహేశ్వరరావు, రాష్ట్ర బి.సి.సెల్ కార్యదర్శి వల్లూరి మధుసూదన్ రావు, బి.సి.నాయకులు మర్రి వెంకట సుబ్బయ్య, పామర్తి కిషోర్ బాబు, కె.మణికంఠ, సాయి మనోజ్ కుమార్, ఎల్.ఎస్.ఆర్.కె ప్రసాద్, రమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News