Breaking News

అక్రమణలను క్రమబద్దీకరించవలసిన భూములు విషయంపై పరిశీలన…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో దీర్ఘకాలంగా పెండిరగ్‌లో ఉన్న జలవనరుల శాఖకు సంబంధించి అక్రమణలను క్రమబద్దీకరించవలసిన భూములు విషయంపై జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆదేశాల మేరకు జాయింట్‌ కలెక్టర్‌ నుపూర్‌ అజయ్‌ మంగళవారం జలవనరుల శాఖ అధికారులతో పరిశీలించారు. విజయవాడ సెంట్రల్‌, పశ్చిమ నియోజకవర్గంలోని జనవనరుల శాఖ భూములను జాయింట్‌ కలెక్టర్‌ పరిశీలించారు. ఏలూరు కాలువ పక్కన ఉన్న అక్రమణల క్రమబద్దీకరణ, అంబేద్కర్‌ కాలనీ, పసుపుతోట, వెంకటేశ్వరనగర్‌, నరసరాజు రోడ్డు, నేతాజీ రోడ్డు, ఊర్మిళ నగర్‌, గాంధీజీ కాలనీ ప్రాంతాల భౌగోళిక సితిగతులను ఆమె పరిశీలించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని జనవనరుల శాఖ భూములను, శాసనసభ్యుల వెలంపల్లి శ్రీనివాసరావుతో కలిసి పరిశీలించారు. పరిశీలనలో జాయింట్‌ కలెక్టర్‌ వెంట ఇరిగేషన్‌ ఎస్‌ఇ, తహాశీల్థార్‌ దుర్గాప్రసాద్‌ ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *