విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
NTR జిల్లా కలెక్టర్ S. ఢిల్లీ రావు, IAS, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం బుధవారం పటమట లోని G.D.E.T.M.C హై స్కూలులో నిర్వహించారు. 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరూ తప్పనిసరిగా అల్బెండ జాల్ 400 మి. గ్రా మాత్రలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలియజేశారు. మంచి చదువులతో పాటు ఆరోగ్యం మీద కూడా పిల్లలు శ్రద్ద వహించాలని సూచించారు. నగర మేయర్ మాట్లాడుతూ శారీరిక ఎదుగుల కోసం మంచి ఆహారం తీసుకోవడం అత్యంత ప్రాముఖ్యం అని విద్యార్థులకు తెలిపారు. నేటి విద్యార్థుల పట్ల ప్రభుత్వం మరియు ఉపాధ్యాయులు ఎంతో నిబద్ధత తో పని చేస్తున్నారని, వారి కోసం చేస్తున్న సేవలను మంచిగా ఉపయోగించుకొని భవిష్యత్తు లో మంచి స్థానాల్లో నిలబడి దేశ మరియు రాష్ట్ర గౌరవాన్ని కాపాడాలని వివరించారు. నగర మేయర్ స్వయంగా విద్యార్థులకు మాత్రలు అందజేశారు. ఈ కార్యక్రమం లో DMHO, డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లం దుర్గ , DEO, స్కూలు ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News