Breaking News

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై బుద్ధా వెంకన్న నిరసన..

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా, టిడిపి నేతలు నిరసన తెలిపారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గం బుద్దా వెంకన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ  పేరును తొలగించినందుకు  ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నమాట్లాడుతూ కొడాలి నాని గాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ఎన్టీఆర్  భక్తులమని అభిమానులని చెప్పుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. ఎన్టీఆర్ బిక్ష వల్ల రాజకీయాల్లోకి కొడాలి నాని, వంశీ, అవినాష్ వచ్చారన్నారు. టిడిపి అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి మరల అదే పేరు నామకరణం చేసి, కడప జిల్లాకు ఉన్న వైఎస్సార్ పేరును తొలగిస్తామన్నారు. కడపలో ఎన్నో త్యాగాలు చేసిన స్వతంత్ర యోధుల లో ఒకరి పేరు పెడతామన్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కి పతనం ప్రారంభమైంది. అందుకే ఇంత విర్రవీగి పోతున్నాడు. తనపతనానికి దారి తీసుకున్నాడన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు పై ఇప్పటికే టిడిపి శ్రేణులు, ఎన్టీఆర్ అభిమానులు పలుచోట్ల ఆందోళనలు జరిగాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *