విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యాలయంలో బుధవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరును మార్పు చేస్తూ రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడానికి ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. యూనివర్సిటీ రావడానికి ఆనాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వల్లే వచ్చింది. యూనివర్సిటీ పేరు మార్పు అనేది జగన్ మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ఇది నిదర్శనమన్నారు. అసలు ఎన్టీఆర్ పేరు మార్చాలని ఆలోచన నీలాంటి దుర్మార్గపు ముఖ్యమంత్రికి ఎలా వచ్చింది. సమయం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. పేరు మార్చాలంటే ప్రజల అనుమతి, గవర్నర్ అనుమతి ఉండాలి, ఈ రెండింటిని అధిగమించి ఏకపక్షంగా తీసుకున్న ఆలోచన విరమించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. విజయవాడ అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షులు మొహమ్మద్ ఇర్ఫాన్ మాట్లాడుతూ : నా జీవితకాలంలో ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇంత నికృష్టంగా పాలన ఉందని, రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే విధంగా జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. శాసనసభలో మాట్లాడుతున్న మంత్రులు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, 2024లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చమరగీతం పాడుతారని విమర్శించారు. అనంతరం అభ్యుదయ తెలుగు కవితా పితామహుడు గురజాడ వెంకట అప్పారావు గారి జయంతి సందర్బంగా ఈరోజు కేశినేని శివనాథ్(చిన్ని) గారి కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఫ్లోర్ లీడర్ పార్లమెంట్ కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు, విజయవాడ అర్బన్ మైనారిటీ సెల్ మాజీ అధ్యక్షులు మొహమ్మద్ ఇర్ఫాన్, SC సెల్ నాయకులు తుపాకుల వెంకటేశ్వర్లు, టిడిపి పార్టీ నాయకులు శివాజీ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News